పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘సలార్‘. మాఫియా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ – హోంబలే ఫిలిమ్స్ కాంబోలో కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్స్ గా నిలిచి.. కలెక్షన్స్ కూడా అదరగొట్టాయి. అలాంటి కాంబోలో ప్రభాస్ తో సినిమా వస్తుందంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా సినిమాకి ‘సలార్’ అనే టైటిల్ పెట్టి.. ఫ్యాన్స్, ప్రేక్షకులలో అంచనాలు రెట్టింపు చేసేశారు. ఈ సినిమాలో శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలకపాత్రలలో కనిపించనున్నారు.
ఓవైపు ఆల్రెడీ సినిమా రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సలార్ వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే 80% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సలార్ నుండి పవర్ ఫుల్ డైలాగ్ లీక్ అయ్యిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జనరల్ గా సలార్ నుండి పిక్స్ లీక్ అవ్వడం చూశాం కానీ.. ఈసారి ఏకంగా డైలాగ్ లీక్ అయ్యిందని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఓ వాయిస్ రికార్డు(ఆడియో) వైరల్ అవుతోంది. అది సినిమాలో ఉందా లేక ఎవరైనా క్రియేట్ చేశారా? అని సందేహాలు కలుగుతున్నప్పటికీ, నిజంగానే సినిమాలో ఉంటే మాత్రం ప్రభాస్ ఇంట్రడక్షన్ కి థియేటర్స్ దద్దరిల్లిపోతాయని ఫ్యాన్స్ అంటున్నారు.
ఆ లీక్ అయిన వాయిస్ రికార్డులో సలార్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ.. సాలిడ్ ఇంట్రడక్షన్ ప్లాన్ చేసినట్లు భావిస్తున్నారు. కేజీఎఫ్ లో పిచ్చోడి క్యారెక్టర్ లాగే ఇందులో కూడా సలార్ ని పరిచయం చేసేందుకు అలాంటి ఓ క్యారెక్టర్ చూపించనున్నారేమో! అంటున్నారు. కానీ.. డైలాగ్ బాగున్నా అది సినిమాలోదా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో కొంతమంది ఫ్యాన్ మేడ్ అని అంటుంటే.. ఇంకొంతమంది అదే రియల్ అయితే సలార్ టీమ్ స్పందించేవారు కదా అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా వయిలెంట్ గా ఉండబోతుందని ఇదివరకే మేకర్స్ చెప్పేశారు. సో.. చూడాలి డార్లింగ్ ఎలాంటి రక్తపాతం సృష్టించనున్నాడో! ఇక ఈ సినిమాకి రవిబస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. మరి సలార్ డైలాగ్ అంటూ వైరల్ అవుతున్న వాయిస్ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Salaar Dialogue 3 by me #Prabhas pic.twitter.com/lGHj73HeYH
— SALAAR REBEL 25 (@KGF_SALAAR) January 25, 2023