సినీ హీరోలకు సంబంధించి ఎలాంటి బ్యాడ్ న్యూస్ వినిపించినా.. ఫ్యాన్స్ లో కంగారు మామూలుగా ఉండదు. ఎందుకంటే.. ఎంతో అభిమానించే హీరోలకు ఆరోగ్యం పరంగా, లేదా ఎలాంటి ఇబ్బదులు ఎదురైనా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆతృత అందరిలోనూ ఉంటుంది. రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి అస్వస్థత అని.. ట్రీట్ మెంట్ కోసం ఏకంగా సపరేట్ ఫ్లయిట్ లో విదేశాలకు వెళ్లాడని కొన్ని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.
సినీ హీరోలకు సంబంధించి ఎలాంటి బ్యాడ్ న్యూస్ వినిపించినా.. ఫ్యాన్స్ లో కంగారు మామూలుగా ఉండదు. ఎందుకంటే.. ఎంతో అభిమానించే హీరోలకు ఆరోగ్యం పరంగా, లేదా ఎలాంటి ఇబ్బదులు ఎదురైనా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆతృత అందరిలోనూ ఉంటుంది. అయితే.. రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి అస్వస్థత అని.. ట్రీట్ మెంట్ కోసం ఏకంగా సపరేట్ ఫ్లయిట్ లో విదేశాలకు వెళ్లాడని కొన్ని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇండియా వైడ్ ఫ్యాన్ బేస్ కలిగిన ప్రభాస్ ఇలాంటి న్యూస్ వినిపించేసరికి ఫ్యాన్స్ అందరూ టెన్షన్ పడిపోతున్నారు. అదీగాక అసలు ప్రభాస్ కి ఏమైంది? వస్తున్న వార్తల్లో నిజమెంత అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ విషయంలోకి వెళ్తే.. డార్లింగ్ ప్రభాస్ ప్రెజెంట్ నాలుగు బిగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక్కో సినిమాని కంప్లీట్ చేస్తూ.. ఈసారి ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అలాంటి ప్రభాస్ కి సడన్ గా అస్వస్థత అని, ట్రీట్మెంట్ కోసం షూటింగ్స్ ఆపేసి విదేశాలకు వెళ్లాడని కథానాలైతే గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. మరి దీనిపై ఇప్పటిదాకా ప్రభాస్ టీమ్ నుండి, మూవీ మేకర్స్ నుండి, ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. దీంతో ఎలాంటి ధృవీకరణ లేకుండా ఎలా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే ఆదిపురుష్ షూట్ తర్వాత ప్రభాస్ మోకాళ్ళకు సర్జరీ చేయించుకొని వచ్చాడు.
ఈ క్రమంలో మరోసారి చికిత్స కోసం ఫారెన్ వెళ్లాడని అనేసరికి ఫ్యాన్స్ టెన్షన్ కి గురవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. దీనిపై ప్రభాస్ టీమ్ నుండి అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం డార్లింగ్.. ఆదిపురుష్ ని కంప్లీట్ చేసి.. ప్రశాంత్ నీల్ తో సలార్, నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే, మారుతీతో కామెడీ హారర్ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇక ఆదిపురుష్ సినిమా.. జూన్ 16న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. మరి డార్లింగ్ ప్రభాస్ గురించి వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.