తెలుగు చిత్ర పరిశ్రమలో సురేఖవాణి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అక్కా, వదిన వంటి విభిన్న పాత్రలు చేస్తూ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపును మూటగట్టుకుంది. అయితే సురేఖవాణి గతంలో సురేష్ తేజ అనే దర్శకుడితో ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. కొంత కాలం వీరి జీవితం సంతోషంగా సాగిన అనుకోని కారణాల వల్ల భర్త సురేష్ తేజ హఠాత్తుగా మరణించాడు. దీంతో అప్పటి నుంచి సురేఖ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ వస్తుంది.
ఈ నేపథ్యంలో సురేఖవాణి రెండో పెళ్లి చేసుకుందంటూ రూమార్స్ భారీగా వినిపిస్తున్నాయి. ఇదే కాకుండా ఆమె మెడలో మంగళసూత్రం ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని ఆధారంగా చేసుకున్న నెటిజన్స్ నిజంగానే సురేఖవాణి రెండు పెళ్లి చేసుకుందేమోనని భావిస్తున్నారు. సురేఖ పైగా నటి కావటంతో పాత్ర నిమిత్తం మాత్రమే మెడలో మంగళసూత్రం వేసుకుందని, పెళ్లి చేసుకోలేదంటూ కొందరు వాదిస్తుంటే.. మరికొందరు మాత్రం లేదు లేదు సురేఖవాణి నిజంగానే రెండో పెళ్లి చేసుకుందంటూ రూమార్స్ క్రియేట్ చేస్తున్నారు. మరి వీరి వాదనలో నిజమెంత అనేది తెలియాలంటే సురేఖవాణి స్పందించేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.