దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్(RRR). జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుపుతున్నారు మేకర్స్. అయితే.. ఓవైపు దేశంలో ఓమిక్రాన్ ఎఫెక్ట్ కూడా వణికిస్తుంది. మరోవైపు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ లో మరో టెన్షన్ మొదలైంది. సౌత్ వైపు రాష్ట్రాలలో సినిమా థియేటర్లు ఓపెన్ ఉంటాయని అనుకున్నా.. ముఖ్యంగా RRR సినిమా హిందీ వెర్షన్ రిలీజయ్యే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో థియేటర్లు 50% ఆక్యుపెన్సీతో రన్ చేసేందుకు మాత్రమే అనుమతులు లభించాయి.
ఇక వీలైనంత వరకు డేంజర్ జోన్ లో థియేటర్లు, షాపింగ్ మాల్స్ కొంతకాలం మూసివేయడమే మంచిదని అధికారులు ముందస్తు హెచ్చరికలు పంపుతున్నారు. ఈ క్రమంలో పే పర్ వ్యూ పద్ధతి హాట్ టాపిక్ అయింది. నిజానికి థియేట్రికల్ బిజినెస్ తక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఆ పద్ధతి బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఇదివరకు సల్మాన్ ఖాన్ ‘రాధే’ సినిమాను ఓటీటీలో పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేశారు. ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని చవిచూసిందో ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఏ సినిమా ఓటీటీలో విడుదలైనా నిమిషాల్లో ఒరిజినల్ ప్రింట్ పైరసీ బయటికి వచ్చేస్తుంది. మరి ఒకవేళ RRR విషయంలో మేకర్స్ ఓటిటి వైపు ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా పైరసీ ఎటాక్ జరుగుతుంది.అదే జరిగితే.. సౌత్ భాషల్లో థియేట్రికల్ బిజినెస్ పై భారీ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే.. ఒక్క ప్రింట్ లీక్ అయ్యిందంటే చాలు.. అన్ని రాష్ట్రాలకు పాకేస్తుంది. అసలే భారీ అంచనాలను క్రియేట్ చేసిన RRR అలా చేస్తే మాత్రం దేశమంతా థియేటర్లు వదిలేసి ఆ వైపే మళ్లుతుంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితిలో మేకర్స్ హిందీ వెర్షన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి ఓవైపు RRR మూవీకి ఓటిటి రిలీజ్ తప్పేలా లేదంటూ సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన మూవీని ఓటిటిలో రిలీజ్ చేసే ధైర్యం చేయరంటూ ఓ వర్గం ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మరి RRR రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.