తెలుగు టీవీ ప్రేక్షకులకు జబర్దస్త్ షో గురించి, అందులో టీమ్ లీడర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అందరి టీమ్స్ తమదైన శైలిలో నవ్విస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే.. తెలుగు టీవీ షోలలో ప్రేమజంటలు అనగానే సుడిగాలి సుధీర్ – యాంకర్ రష్మీ, వర్ష – ఇమ్మానుయేల్ పేర్లు గుర్తొస్తాయి. కానీ ఈ జంటలు కేవలం షో వరకే లవర్స్ గా క్రేజ్ సంపాదించుకున్నారు.
పర్సనల్ గా ఎవరి లైఫ్ వారిదే.. ఎవరి లవ్ స్టోరీ వాళ్లదే. కానీ జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా పేరు తెచ్చుకొని.. ఇటీవలే తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టాడు రాకింగ్ రాకేష్. అయితే.. రాకేష్ లవ్ స్టోరీ టీవీ షో వరకే పరిమితం కాలేదు. ఈ మధ్యకాలంలో రాకేష్ స్కిట్ లలో కనిపిస్తున్న జోర్దార్ సుజాత.. రాకేష్ తో కలిసి ఏ స్థాయిలో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే.తాజాగా ఈ ఇద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్న విషయాన్ని ‘శ్రీదేవి డ్రామా కంపెనీ‘ వాలెంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో బయట పెట్టారు. అందరూ కొంతకాలంగా రాకేష్ – సుజాత జంటను టీవీ షోల వరకే.. పబ్లిక్ స్టంట్స్ చేస్తున్నారని భావించారు. కానీ ఇద్దరూ తమ పెర్ఫార్మన్స్ తర్వాత యాంకర్ సుధీర్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో అందరి ముందు బహిర్గతం చేసి ఎమోషనల్ అయ్యారు.
సుధీర్ మాట్లాడుతూ.. “అరేయ్ రాకేష్! కొంతకాలంగా సుజాతకు నీకు మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని బయట ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పై క్లారిటీ ఇవ్వండిరా?” అని అడిగాడు. వెంటనే స్పందించిన రాకేష్.. ‘నేను మొదట్లో లవ్, పెళ్లి వద్దు అనుకున్నా.. కానీ ఈ మధ్య నాలో కూడా మార్పులు వచ్చేశాయి. సుజాత నాకు మొదటి నుండి సపోర్ట్ చేస్తూ.. మా అమ్మ తర్వాత అంతలా అర్థం చేసుకుంది. అమ్మ తర్వాత ఆ స్థానం తనకే ఇవ్వాలని అనుకుంటున్నా.. ఇక నిర్ణయం తనదే’ అని చెప్పేశాడు.
ఇక రాకేష్ తర్వాత సుజాత మాట్లాడుతూ.. ‘నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం. నా లైఫ్ లోకి వచ్చేవాడు కూడా మా డాడీ లెక్కనే చూసుకోవాలని అనుకుంటున్నా. ఒక ఏడాదిన్నరగా నన్ను భరిస్తున్నాడు. నన్ను ఓ ఫ్రెండ్ లా దగ్గరుండి సపోర్ట్ చేస్తున్నాడు. లైఫ్ లో కూడా ఫ్యూచర్ అంతా అలాగే సపోర్ట్ చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని తన మనసులో మాట చెప్పేసింది.
ఆ వెంటనే రాకేష్ అందుకొని.. ‘అమ్మ ఒకటే చెప్తున్నా.. నిన్ను మీ అమ్మలా చూసుకునే కోడలిని తీసుకొస్తున్నా’ అన్నాడు. తర్వాత సుజాతకు వాలెంటైన్స్ డే గిఫ్ట్ గా రింగ్ తొడిగి ప్రేమను గెలిచాడు. ఇక షోలో పాల్గొన్న జడ్జిలు, సుధీర్, ప్రేక్షకులు అందరూ రాకేష్ – సుజాతల ప్రేమకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక పెద్దల అంగీకారం తర్వాతే వీరిద్దరూ షోలో ప్రపోజ్ చేసుకున్నట్లు కమెడియన్ బాబు చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీరి లవ్ ప్రపోజల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి రాకేష్ – సుజాత ప్రేమజంట పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.