హ్యారీ పోటర్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి గుర్తింపు, క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రముఖ రచయిత జేకే రౌలింగ్ కలం నుంచి జాలువారిన.. ఈ సృష్టి పాఠకులను, ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. బహుశా ప్రపంచంలో ఓ పుస్తకం ఆధారంగా ఇన్ని సిరీస్‌లు వచ్చింది కేవలం హ్యారీ పోటర్ మీద మాత్రమే. ఇక ఈ సినిమా పేరు వినగానే.. పిల్లల ముఖాల్లో కనిపించే సంతోషం అంతా ఇంతా కాదు. మంత్రదండంతో హీరో చేసే విన్యాసాలు పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తాయి. ఇక హ్యారీ పోటర్ సినిమాలోని కొన్ని పాత్రలను ప్రేక్షలకు ఎన్నటికి మర్చిపోలేరు. వారిపైన ఆ పాత్రలు అలాంటి చెరగని ముద్ర వేస్తాయి. ఈ కోవకు చెందినదే సినిమాలోని హ్యాగ్రిడ్ పాత్ర. ఆ పాత్ర పోషించిన స్కాటిష్ నటుడు రాబీ కోల్ట్రేన్ (72) శుక్రవారం నాడు మృతి చెందారు. ఆయన చనిపోవడంతో.. హాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది.
రాబీ కోల్ట్రెన్.. మృతి చెందిన వార్తను ఏజెంట్ బెలిందా రైట్ ప్రకటించారు. శుక్రవారం నాడు స్కాట్లాండ్‌లోని ఆసుపత్రిలో రాబీ కన్ను మూసినట్లు తెలిపారు. అయితే మరణానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక రాబీ మరణం పట్ల స్పందిస్తూ.. ‘‘అద్భుతమైన నటుడే కాకుండా.. అతను న్యాయపరంగా ఎంతో తెలివైనవాడు. చమత్కరవంతుడు. ఇక 40 సంవత్సరాల తర్వాత అతని ఏజెంట్ అని పిలవబడటం గర్వంగా ఉంది. నేను అతన్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’’ అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. రాబీ కోల్ట్రెన్.. ప్రముఖ టీవీ సిరీస్ క్రాకర్‌లో నేరాలను పరిష్కరించే సైక్రియార్టిస్ట్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
కోల్ట్రేన్‌కు అతని సోదరి అన్నీ రే, అతని మాజీ భార్య రోనా గెమ్మెల్, అతని పిల్లలు స్పెన్సర్ , ఆలిస్‌లు కుటుంబ సభ్యులున్నారు. రాబీ కోల్ట్రేన్ మొదటిసారిగా 1990లలో క్రాకర్‌లో హార్డ్-బిటెన్ డిటెక్టివ్ పాత్ర ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు అయ్యాడు. అతని నటనకుగాను.. బాఫ్టాలో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. అలానే కోల్ట్రేన్.. జేకే రౌలింగ్ సృష్టించిన హ్యారీ పాటర్ సిరీస్‌లో హాగ్రిడ్ పాత్ర ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు 2001-2011 మధ్య విడుదలైన మొత్తం ఎనిమిది హ్యారీ పోటర్ చిత్రాలలో బాయ్ మాంత్రికుడికి గురువుగా, స్నేహితుడిగా వ్యవహరించే పాత్రలో కనిపించాడు కోల్ట్రేన్. జేమ్స్ బాండ్ థ్రిల్లర్స్ గోల్డెన్ ఐ, ది వరల్డ్ ఈజ్‌లో రష్యన్ క్రైమ్ బాస్ ప్రాతల్లో కూడా నటించాడు. రాబీ కోల్ట్రేన్ మృతిపై హాలీవుడ్ ప్రముఖులు, జేకే రౌలింగ్ సంతాపం వ్యక్తం చేశారు.
Robbie Coltrane has passed away at age 72 pic.twitter.com/gBqeVaEN3e
— Culture Crave 🍿 (@CultureCrave) October 14, 2022