RGV: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించిన మూవీ ‘లడ్కీ’. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూలై 15వ తేదీన తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, చైనా భాషల్లో విడుదల అవుతుంది. లడ్కీ (తెలుగులో అమ్మాయి) చిత్రంలో పూజా యాక్షన్ సీన్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ సినిమాలో బ్రూస్ లీని అభిమానించే పాత్రలో పూజా కనిపించనుంది. ఈ క్రమంలో సినిమా రిలీజ్ కి దగ్గరపడటంతో ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు రాంగోపాల్ వర్మ టీమ్. అయితే.. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ‘అమ్మాయి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యాంకర్ శ్యామల హోస్ట్ గా వ్యవహరించింది. ఇక స్టేజిపై వర్మతో కలిసి ఓ ఫన్ గేమ్ ఆడించే ప్రయత్నం చేసింది. కానీ.. వర్మ సినిమా విషయంలో సీరియస్ గా ఉన్నానని చెప్పి స్టేజి దిగిపోయాడు. ప్రస్తుతం వర్మ శ్యామలపై సీరియస్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.