తెలుగు సినీ వినీలాకాశంలో ద్రువతారగా ఓ వెలుగు వెలిగి ఆరిపోయిన లెజెండ్రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సితారామాశాస్త్రి. ఆయన జయంతి వేడుకలు శుక్రవారం హైదరాబాద్ లోని ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన నేటి తరం సినిమాలపై, అశ్లీలతల అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
సందేశం అంటే నా దృష్టిలో ప్రవచనాలు చెప్పమని కాదు.. సినిమా సినిమాగా ఉంటూనే కొంతైన సమాజానికి ఓ సందేశాన్ని ఇచ్చేలా చిత్రాలను తెరకెక్కించాలని ఆయన తెలిపారు. ఇక ఇప్పుడు వచ్చే సినిమాల్లో వినోదంతో పాటు విజ్ఞానాన్ని, సందేశాన్ని కూడా అందించాలని అన్నారు. ఇక మరీ ముఖ్యంగాచిత్రాల్లో అశ్లీలత, హింస వంటి సన్నివేశాలు కూడా తగ్గించాలని కోరారు.
ఇది కూడా చదవండి: Malavika Mohanan: హీరోయిన్ ట్వీట్‌కు ఎంపీ రిప్లై.. మండిపడుతున్న నెటిజన్లు..శృంగారం వద్దని చెప్పను.. శృంగారం కూడా అవసరమే. కానీ ఇప్పుడున్న విధంగా వద్దని, డబుల్ మీనింగ్ డైలాగులు వద్దని ఆయన సూచించారు. ఇక గతంలో మాయాబజార్, గుండమ్మ కథ లాంటి గొప్ప చిత్రాలు ఇప్పటికి కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయని వెంకయ్య నాయుడు అన్నారు. తాజాగా వెంకయ్య నాయుడు కామెంట్స్ దనదైన శైలీలో స్పందించారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఓహో అలాగా.. అవునా.. ఫాంటాస్టిక్.. ఇంతకు ముందు ఎప్పుడు వినని అద్భుతమైన సలహాకి థాంక్యూ సర్ అంటూ వర్మ సెటైర్లు వేశారు.
గురువారం హైదరాబాద్ లో జరిగిన లెజెండ్రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సితారామాశాస్త్రి జయంతి వేడుకలకు వెంకయ్య నాయుడుతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రవచనకర్త గరికపాటి మరి కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. వెంకయ్య నాయుడు కామెంట్స్ పై స్పందించిన వర్మ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
https://t.co/8BZMWeckuu oho ? alaaga? Avuna? Fantaaasticccc ..Thank u for the extraordinary never before heard advise sirrrrrr🙏🙏🙏🙏🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) May 21, 2022