ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కొద్ది సేపటి క్రితం మృతిచెందారు. న్యూమోనియాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలుగు సినిపరిశ్రమలో ఆయనకు అనేక మంది సన్నిహితులు ఉన్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు వీరఅభిమానే కాకుండా.. బంధువు కూడా అవుతారు. సాధారణంగా త్రివిక్రమ్ వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవరికి తెలియదు.
త్రివిక్రమ్ ప్రతిభతో పాటు అతని వ్యక్తిత్వం మెచ్చిన సిరివెన్నెల స్వయంగా తమ ఇంట్లో మాటల మాంత్రికుడి పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడికి వెళ్లిన త్రివిక్రమ్ ఆ అమ్మాయిని కాకుండా వాళ్ల చెల్లిని ఇష్టపడ్డారట. ఈ సమస్యను ఎలాగోలా పరిష్కరించిన సిరివెన్నెల త్రివిక్రమ్-సౌజన్యల వివాహం జరిపించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడి కూతురే సౌజన్య. ఇలా ఈ పెళ్లితో ది గ్రేట్ సిరివెన్నెల సీతారామశాస్త్రికి త్రివిక్రమ్ అల్లుడు అవుతారు.