తెలిసి చేస్తుందో, తెలీక చేస్తుందో గానీ హీరోయిన్ రష్మిక.. ఈ మధ్య కాలంలో తరుచూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. ‘కాంతార’ రిలీజ్ టైంలో మొదలైన ఈ గొడవ ఇప్పటికీ అలానే కొనసాగుతూనే ఉంది. ఆ సినిమా హీరో రిషభ్ తో పాటు రష్మిక.. ఒకరిపై ఒకరు ఇన్ డైరెక్ట్ గా సెటైర్స్ కూడా వేసుకున్నారు. దీంతో సొంత రాష్ట్రం కర్ణాటకలో ఈమెపై చాలా నెగిటివిటీ వస్తోంది. పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయే సరికి యాటిట్యూడ్ చూపిస్తుందని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ విషయమై స్పందించింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ మూవీతో హీరోయిన్ గా మారిన రష్మిక, ఆ తర్వాత తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2021 చివర్లో వచ్చిన ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించింది. హిందీలో అమితాబ్ తో కలిసి ‘గుడ్ బై’ మూవీ చేసిన రష్మిక.. త్వరలో ‘మిషన్ మజ్ను’తో ప్రేక్షకుల్ని పలకరించనుంది. అయితే గత కొన్నిరోజుల నుంచి రష్మిక చేస్తున్న కొన్ని పనులు కాంట్రవర్సీకి కారణమవుతున్నాయి. ‘కాంతార’ రిలీజ్ టైంలో రిపోర్టర్ ప్రశ్నకు బదులిస్తూ.. ఆ సినిమా చూడలేదు అని చెప్పింది. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనని పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పకుండా చేతివేళ్లతో సైగ చేసి చూపించింది. దీనిపై సీరియస్ అయిన నటుడు డైరెక్టర్ రిషభ్ శెట్టి.. సేమ్ అలానే చేతివేళ్లు చూపించి రష్మికని ట్రోల్ చేశాడు.
ఇక తాజాగా ‘మిషన్ మజ్ను’ ఈవెంట్ లోనూ మాట్లాడుతూ.. సౌత్ మూవీస్ లో కేవలం మాస్ సాంగ్స్ మాత్రమే ఉంటాయని, అసలైన రొమాంటిక్ సాంగ్స్ అంటే నార్త్ మూవీస్ లోనే ఉంటాయని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమెని నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు దీనిపైనే స్పందించింది. ‘యాక్టర్ అయినంత మాత్రాన ప్రజలు ఇష్టపడతారని చెప్పలేం. ఇక్కడ చాలా నెగిటివిటీ ఉంటుంది. ప్రేమ కూడా ఉంటుంది. నేను పబ్లిక్ సెలబ్రిటీని. కొన్నిసార్లు నన్ను వాళ్లు ఇష్టపడకపోవచ్చు. నేను మాట్లాడే విధానం, చేతులతో సంజ్ఞలు చేయడం కొందరికి నచ్చకపోవచ్చు. నా ఎక్స్ ప్రెషన్స్ కూడా నచ్చకపోవచ్చు.’ అని రష్మిక చెప్పుకొచ్చింది. మరి రష్మిక వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని దిగువ కామెంట్స్ లో పోస్ట్ చేయండి.