రావు రమేష్.. ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటుడు. ఆయన తండ్రి లెజండరీ యాక్టర్ రావు గోపాలరావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్ అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొత్త బంగారులోకం సినిమాలో ఆయన యాక్టింగ్‌తో ప్రేక్షకులు మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఇక వెనుతిరిగి చూడలేదు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో.. బిజీ ఆర్టిస్ట్‌గా మారారు. తెలుగులోనే కాక.. తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్నారు. విభిన్నమైన పాత్రలు చేస్తూ.. మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక సినిమాలపరంగానే కాక.. వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా గొప్పవాడని అంటారు రావు రమేష్ సన్నిహితులు. నా అనుకున్న వారిని ఆదుకోవడంలో ముందుంటారని ప్రశంసిస్తారు.
తాజాగా రావు రమేష్ చేసిన ఓ పనిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచి నటుడే కాక.. మంచి మనసున్న వ్యక్తి అంటూ పొగుడుతున్నారు. ఇంతకు ఏమైందంటే.. కొన్ని రోజుల క్రితం రావు రమేష్ వ్యక్తిగత మేకప్‌మెన్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రావు రమేష్ ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. మేకప్ మెన్ బాబు మరణించడంతో.. రావు రమేష్ ఆ కుటుంబానికి ఆర్ధిక సాయం చేశాడు.
బాబు కుటుంబ సభ్యులను కలిసి.. వారిని ఓదార్చడమే కాక.. ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్ధిక సాయం చేశాడు రావు రమేష్. అంతేకాక.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఇక రావు రమేష్ చేసిన సాయంపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ కుటుంబాన్ని ఆయన ఆదుకున్నారు.. ఇది రావు రమేష్ మానవతా దృక్పథానికి నిలువెత్తు నిదర్శనం అని ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూంపలో తెలియజేయండి.