బిగ్ బాస్ తెలుగు ఓటీటీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బిగ్ బాస్ గురించే చర్చ జరుగుతోంది. మే 21న గ్రాండ్ ఫినాలే కావడంతో ఎవరు గెలుస్తారు? విన్నర్ కు ఎంత మొత్తం చెల్లిస్తారు అంటూ వెతుకులాట మొదలు పెట్టేశారు. అయితే బిందు మాధవి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్-1 విజేతగా నిలిచిందని ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతోంది. ఇంక అఖిల్ రన్నర్ గా నిలిచినట్లు చెబుతున్నారు. హోస్ట్ నాగార్జున అధికారికంగా ప్రకటించాల్సి ఉంది అంతే. అయితే ప్రస్తుతం బిందు మాధవి గురించే సోషల్ మీడియాలో వెతుకులాట. ఈ క్రమంలోనే రమ్యకృష్ణ- బిందు మాధవి మధ్య రిలేషన్ తెరమీదకు వచ్చింది.
రమ్యకృష్ణ- బిందు మాధవికి సపోర్ట్ చేస్తూ ఓ వీడియో కూడా విడుదల చేయడంతో ఇప్పుడు వారి మధ్య రిలేషన్ ఏంటి అంటూ ప్రశ్నలు వస్తున్నాయి. రమ్యకృష్ణ- బిందు మాధవి మంచి ఫ్రెండ్స్ అని చాలా మందికి తెలియదు. బిందు మాధవి తెలుగమ్మాయి అయినా.. ఇక్కడ అవకాశాలు లేక చెన్నై వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అక్కడ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న క్రమంలోనే రమ్యకృష్ణకు బిందు మాధవి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.
ఆ రిలేషన్ తోనే రమ్యకృష్ణ- బిందు మాధవిని సపోర్ట్ చేస్తూ వీడియో కూడా చేసింది. అయితే కొంతమంది రమ్యకృష్ణ.. బిందు మాధవి బంధువులు అయి ఉంటారు అనుకుంటూ డౌటనుమానాలు లేవనెత్తుతున్నారు. అయితే వాళ్లు మంచి మిత్రులు మాత్రమే అని తెలిసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. బిందు మాధవి లాంటి ఆడపులి బిగ్ బాస్ హౌస్ లో ఉండటం ఎంతో సంతోషం అని రమ్యకృష్ణ తెలిపారు. నేను బిందు మాధవిని సపోర్ట్ చేస్తున్నా.. మీరు కూడా బిందుకు ఓట్లు వేసి గెలిపించండి అంటూ రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది.
ఇంక బిగ్ బాస్ నాన్ స్టాప్ విషయానికి వస్తే.. అందరూ అనుకున్నట్లుగానే బిందు మాధవి టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఆమెకు ప్రైజ్ మనీగా రూ.40 లక్షలు అందనున్నాయి. అంతేకాకుండా 12 వారలకు గానూ దాదాపు రూ.25 లక్షలుపైనే అందనున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి బిగ్ బాస్ విన్నర్ గా బిందు మాధవి దాదాపు రూ.70 లక్షలు గెలుచుకునే అవకాసం ఉందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా మళ్లీ తెలుగులో తనకంటూ అభిమానులను సొంతం చేసుకుంది. బిందు మాధవి విన్నర్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.