ప్రముఖ నటి రంభ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెనడాలో ఉన్న రంభ.. పిల్లలను స్కూల్ నుంచి తీసుకుని వస్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఇందకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రంభ.. తమ కోసం ప్రార్థించాల్సిందిగా అభిమానులను కోరింది. ఈ ఘటనలో రంభ చిన్న కుమార్తె సాషా కాస్త తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు, నెటిజనులు ఆమె క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ చేయసాగారు.
కెనడా సమయం ప్రకారం సోమవారం సాయంత్రం.. స్కూల్ నుంచి పిల్లలను తీసుకుని వస్తుండగా.. ఇంటర్‌సెక్షన్ వద్ద రంభ ప్రయాణిస్తున్న కారుని మరో కారు వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అందరికి చిన్న చిన్న గాయాలయినట్లు రంభ తెలిపింది. అయితే ఇక ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూసిన నెటిజనులు.. నిజంగానే తృటిలో రంభ, ఆమె పిల్లలు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.. లేదంటే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేదని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రమాదానికి సంబంధించి రంభ పోస్ట్ చేసిన ఫోటోల్లో.. కారును సైడ్ నుంచి గుద్దడం వల్ల యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అలా కాకుండా ముందు భాగం నుంచి వచ్చి ఢీకొడితే.. ప్రమాదం తీవ్రత పెరిగేది. గతంలో ఇలాంటి ప్రమాద సంఘటనల్లో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికి.. ఎందరో ప్రాణాలు కోల్పోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గుడ్డిలో మెల్లలాగా.. ముందు భాగం నుంచి కాకుండా.. సైడ్‌లో యాక్సిడెంట్ జరగడం వల్ల ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది అంటున్నారు నెటిజనులు.
ఇక హీరోయిన్ రంభ అసలు పేరు విజయలక్ష్మి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కలిపి సుమారు 100కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగులో టాప్ హీరోలందరితో యాక్ట్ చేసింది. సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత.. శ్రీలంకకి చెందిన తమిళ్ బిజినెస్ మ్యాన్ ఇంద్రకుమార్‌ని పెళ్లి చేసుకుంది రంభ. వీరికి 2010, ఏప్రిల్ 10న వివాహమైంది. రంభకి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. ప్రస్తుతం కుటుంబంతో కలిసి కెనడాలో ఉంటుంది. కొన్ని రోజుల క్రితమే ఇండియా వచ్చి వెళ్లింది రంభ. ఇక ఆమె కుమార్తె త్వరగా కోలుకోవాలంటూ నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.