రామ్ గోపాల్ వర్మ.. వివాదం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఉంటాడు.. కాదు కాదు ఆర్జీవీ ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉంటుంది అని కొందరు కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు ఆర్జీవీ.
రామ్ గోపాల్ వర్మ.. వివాదం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఉంటాడు.. కాదు కాదు ఆర్జీవీ ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉంటుంది అని కొందరు కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఆర్జీవీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తనపనేంటో తను చేసుకుంటు పోతుంటాడు. కొన్ని రోజుల క్రితం అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి ప్రదీప్ కుటుంబం తరపున పోరాడి ప్రభుత్వం తరపునుంచి 8 లక్షల రూపాయలని అందించాడు. ఇది కేవలం వర్మ పోరాటం మూలంగానే వచ్చాయి అనడంతో అతిశయోక్తిలేదు. అదీకాక యూనివర్సిటీ ప్రొఫెసర్ల నుంచి నిధులను సమీకరించి దాదాపు లక్షా పదివేల రూపాయలను ఆ కుటుంబానికి అందజేశాడు. దాంతో ఒక్కసారిగా హీరో అయిపోయాడు రామ్ గోపాల్ వర్మ. అయితే తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు ఆర్జీవీ. నాగార్జున యూనివర్సిటీకి చీఫ్ గెస్ట్ గా వెళ్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
రామ్ గోపాల్ వర్మ.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. ఎప్పుడు ఏదో ఒక అంశంపై వార్తల్లో వినపడుతుంటాడు. కొన్ని రోజుల క్రితం అంబర్ పేట్ వీధి కుక్కల దాడిపై వరుస ట్వీట్స్ తో హైదరాబాద్ మేయర్ ను టార్గెట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు వర్మ. బుధవారం(మార్చి 15)న గుంటూరు లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన అకాడమిక్ ఎగ్జిబిషన్ 2023 వేడుకకు ఆర్జీవీ ముఖ్య అతిథిగా వెళ్లాడు. ఈ ఎగ్జిబిషన్ లో వర్మ మాట్లాడుతూ..”మీకు నచ్చింది తినండి, తాగండి లైఫ్ ను ఎంజాయ్ చేయండి. పక్కొడి గురించి ఆలోచించోద్దు. ఇక నేను చనిపోయాక స్వర్గానికి వెళ్తే.. అక్కడ ఏం లేకపోతే ఎలా? అందుకే అక్కడికి వెళ్లి బాధపడటం కంటే ఇక్కడే అన్ని అనుభవిస్తున్నా. అదీకాక స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకలు ఉండకపోవచ్చు. అందుకే ఇక్కడే ఎంజాయ్ చేయాలి” అంటూ స్టూడెంట్స్ కు ఉచిత సలహాలు ఇచ్చాడు వర్మ.
రంభ, ఊర్వశి, మేనకలతో తిరిగినప్పుడే మోక్షం లభిస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆర్జీవీ. ఇక కొత్త వైరస్ వచ్చి తాను తప్ప మిగతా మగజాతి అంతా పోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు మహిళలందరికి నేనే దిక్కు అవుతాను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వర్మ మాటలకు అక్కడున్న మహిళా లెక్చరర్లు అంతా షాక్ తిన్నారు. నేను బ్రెయిన్ ఉన్న జంతువును అంటూ చెప్పుకొచ్చాడు వర్మ. ఇక ఆర్జీవీ మాటలను తాను కూడా సమర్థిస్తున్నాను అంటూనే అతడికి ఆస్కార్ అవార్డు ఇవ్వడం కూడా తక్కువే అంటూ యూనివర్సిటీ వీసీ ఆర్జీవీకి మద్దతుపలికాడు. అయితే వర్మ మాట్లాడుతున్నంత సేపు స్టూడెంట్స్ గట్టిగా అరుస్తూ.. ఈలలు వేస్తూ.. రెచ్చిపోయారు. మరి మగజాతి అంతా పోవాలి అన్న ఆర్జీవీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.