రాహుల్ రామకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని నటుడు. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో అనదికాలంలోనే టాప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ట్రిపుల్ ఆర్ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు రాహుల్ రామకృష్ణ. సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్లు వేసినా.. రియల్ లైఫ్‌లో మాత్రం.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉంటారు రాహుల్ రామకృష్ణ. స్వయంగా ఆయనే వివాదాలు కొని తెచ్చుకుంటారు. ట్విట్టర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వివాదాల్లో నిలిచే రాహుల్ రామకృష్ణ.. మరోసారి అదే పని చేశారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు ఆ మహానీయుడిని తలుచుని.. గొప్పగా నివాళులు అర్పిస్తే.. రాహుల్ రామకృష్ణ మాత్రం.. మహాత్మ గాంధీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ట్వీట్ ప్రసుత్తం వైరల్‌గా మారింది.
మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తుండగా.. రాహుల్ రామకృష్ణ మాత్రం.. వివాదాస్పద ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను’ అంటూ రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశాడు. దీనిపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన గ్రేట్ కాదు.. నువ్వే గ్రేట్ అన్నా అంటూ రాహుల్ రామకృష్ణ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా మందు దొరకదు కదా.. అందుకే పిచ్చిలేచి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీల నాయకులు సైతం రామకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇక విమర్శలు పెరగడం వల్ల.. ట్వీట్ డిలీట్ చేశాడు. కానీ ఇప్పటికే ఇందుకు సంబంధించిన ట్వీట్ స్క్రీన్ షాట్ వైరలవుతోంది.
రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో పలు మార్లు ఇలా వివాదాస్పద ట్వీట్లు చేశాడు. వాటిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. కొన్నిసార్లు తన చేసిన పోస్టులను డిలీట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓ సారి అయితే ఏకంగా ఇక తను సినిమాలు చేయనని ట్వీట్ చేసి.. మళ్లీ తూచ్ అదేం లేదు అని ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఆ తర్వాత సినిమా రివ్యూయర్ల మీద కూడా వివాదాస్పద ట్వీట్లు చేసి.. ఇలానే విమర్శలపాలయ్యాడు. ఇక తాజాగా ఇప్పుడు గాంధీ మీద వివాదాస్పద ట్వీట్ చేశాడు.
రాహుల్ రామకృష్ణ తొలుత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘సైన్మా’ అనే షార్ట్ ఫిలిం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలోనూ మంచి నటన కనబర్చాడు. దాంతో వెంటనే విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో కీలకపాత్ర పోషించాడు. ఈ సినిమాతో రాహుల్ రామకృష్ణకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు.రాహుల్ చివరగా నటించిన సినిమా ‘విరాట్ పర్వం’. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లు ఆయన చేతిలో ఉన్నాయి. ఇక తాజాగా గాందీ మీద ట్వీట్ చేసి వివాదంలో నిలిచాడు.
Rahul Ramakrishna About Gandiji🤬🤬🤬 pic.twitter.com/LePX53baBF
— Sekhar Rambo (@RamboSekhar) October 3, 2022