ప్రస్తుతం ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ మూవీ ఇష్యూ నడుస్తోంది. దర్శక నిర్మాతగా పూరి జగన్నాథ్ రూపొందించిన ఈ సినిమా నిర్మాణంలో హీరోయిన్ ఛార్మి కూడా భాగమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఛార్మి పూరి జగన్నాథ్ తో కలిసి ఇప్పటి వరకు పలు చిత్రాలు నిర్మించింది. అలాగే వీరిద్దరూ ఇండస్ట్రీలో రకరకాల రూమర్లు కూడా ఫేస్ చేశారు. కానీ.. తమది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమేనని.. సినిమా విషయంలో ఒక నిర్మాత, దర్శకుడికి ఉండే రిలేషన్ మాత్రమే తమ మధ్య ఉంటుందని చెబుతూ వచ్చారు.
ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ ‘లైగర్’ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ అందుకొని భారీ నష్టాలను చవిచూసినట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో లైగర్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్.. పూరి జగన్నాథ్ ల మధ్య వివాదం మొదలైంది. లైగర్ మూవీ డిజాస్టర్ కావడంతో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు దారుణంగా నష్టపోయామని.. తమకు నష్టపరిహారం అందించాలని, పూరీ జగన్నాథ్ ఇంటి వద్ద ధర్నా చేస్తామని డిస్టిబ్యూటర్లు లేఖ ఒకటి వైరల్ అయ్యింది.
ఈ నేపథ్యంలో తనను వేధిస్తున్నారని.. తన కుటుంబానికి హాని ఉందని డైరెక్టర్ పూరి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే.. లైగర్ సినిమా విషయంలో సహనిర్మాత ఛార్మి కూడా భారీ నష్టాలను ఫేస్ చేసిందని టాక్. లైగర్ రిలీజ్ ముందు వరకు పూరితో కనిపించిన ఛార్మి.. సినిమా రిజల్ట్ వచ్చినప్పటి నుండి ఎక్కడా కనిపించలేదు. అదీగాక ప్రస్తుతం లైగర్ విషయంలో ఇంత జరగుతున్నా.. పూరి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకునే ఛార్మీ వైపు నుంచి ఏ మాత్రం స్పందన లేదు. కనీసం ఒక ట్వీట్.. స్టేట్ మెంట్ గాని లేకపోవడం గమనార్హం. దీంతో ఇంతకాలం పూరీ జగన్నాథ్ వెంటే ఉన్న ఛార్మి ఇప్పుడు ఎక్కడ ఉంది? పూరి ఒక్కడే బాధ్యుడిగా ఇబ్బందులు పడుతుంటే ఛార్మి ఏం చేస్తోంది? అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఛార్మి త్వరలోనే స్పందిస్తుందేమో చూడాలి!