Puri Jagannadh: ఇటీవల చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో దుమారం రేపాయో చెప్పక్కర్లేదు. బండ్ల మాటలకు పూరి ఫ్యామిలీ సైతం షాకయ్యారు. పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ సినిమాను ప్రమోట్ చేయట్లేదని.. ఇక్కడ ఆకాష్ సినిమా రిలీజ్ ఉంటే పూరి వెళ్లి ముంబైలో కూర్చోవడం ఏంటని? ఆకాష్ కంటే అంత ముఖ్యం ఏమైందని, రాకుండా అంత బిజీగా ఏం చేస్తున్నావు అన్నా? అంటూ ఎక్కువగా పర్సనల్ విషయాలు టచ్ చేసినట్లుగా అందరికి అనిపించింది.
ఈ క్రమంలో తాజాగా పూరి జగన్నాథ్ తన యూట్యూబ్ ఛానల్ లో ఓ ఆడియో క్లిప్ వీడియో పోస్ట్ చేశాడు. అందులో.. “గుర్తు పెట్టుకోండి.. మన నాలుకు కదులుతున్నంత సేపు మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే జీవితంలో ఎక్కువసేపు మనం వింటూ ఉండటం మంచిది. ఫ్యామిలీ మెంబర్స్.. మీ ఫ్రెండ్స్.. ఆఫీస్ మెంబర్స్.. ఇలా ఆఖరికి కట్టుకున్న భార్య దగ్గర కూడా ఆచితూచి మాట్లాడండి. చీప్‌గా వాగొద్దు.. చీప్‌గా ప్రవర్తించొద్దు.. మన వాగుడు మన కెరీర్‌ను, క్రెడిబులిటీని డిసైడ్ చేస్తుంది.
మీరు సుమతీ శతకం వినే ఉంటారు. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అని.. తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం చాలా మంచిది. చివరిగా ఒక మాట.. నీ లైఫ్, నీ డెత్.. నీ టంగ్ మీద ఆధారపడి ఉంటుంది” అని పూరి చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పూరి మాటలు ఖచ్చితంగా బండ్ల గణేష్ స్పీచ్ ని ఉద్దేశించే అయ్యుంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి పూరి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.