SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Puri Jagannadh Fans Open Letter On Distributors Issue Goes Viral

Puri Fan Open Letter: నిజమే పూరి జగన్నాథ్‌ మోసగాడు! పరువు తీసేద్దాం రండి!

  • Written By: Ajay Krishna
  • Published Date - Thu - 27 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Puri Fan Open Letter: నిజమే పూరి జగన్నాథ్‌ మోసగాడు! పరువు తీసేద్దాం రండి!

కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో ఓ స్టార్ డైరెక్టర్ పై పెద్ద చర్చ జరుగుతోంది. కేవలం ఒకే ఒక్క సినిమా ఫెయిల్యూర్ కారణంగా దర్శకుడి పరువు తీసే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. ఎవరి గురించి చెబుతున్నానో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎస్.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈయన గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన ఏమిలేదు. కానీ.. చెప్పాల్సిన కొత్త విషయాలు చాలా ఉన్నాయి. సమాజంలో ఏ మనిషి వందశాతం మంచితనంతో బ్రతకలేడు.. వంద పనులు మంచివే చేయలేడు. ఒకవేళ 99 మంచి పనులు చేసి ఒక్క తప్పుతో దొరికినా.. ఆ 99 మంచి పనులను పక్కన పెట్టేసి, ఒకే తప్పుపై నిందలు వేస్తూ పరువు తీస్తుంటారు.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ పై డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అదే ప్రయత్నం చేస్తున్నారు. లైగర్ సినిమా ప్లాప్ అవ్వడంతో పూరి జగన్నాథ్ పీకల్లోతు కష్టాల్లో పడ్డాడు. తన సొంత ప్రొడక్షన్.. పూరి కనెక్ట్స్ ఎల్ఎల్ పి బ్యానర్ లో లైగర్ మూవీ తెరకెక్కించాడు. అయితే.. ఆ మూవీ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారంలో కాకతీయ ఎగ్జిబిటర్స్ నిర్వాహకుడు వరంగల్ శ్రీనుతో ఏప్రిల్ 12న అగ్రిమెంట్ చేసుకున్నారు. తీరా సినిమా నష్టాలను మిగిల్చేసరికి.. 80 మందికి పైగా ఎగ్జిబిటర్లు జూబ్లీహిల్స్ లోని పూరి జగన్నాథ్ ఇంటి ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఓ వాట్సాప్ మెసేజ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఆ వాట్సాప్ మెసేజ్ పై పూరి తనదైన శైలిలో స్పందించడం కూడా మనం ఆడియో టేప్ లో విన్నాం.

ఈ క్రమంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తాజాగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో తనకు, తన కుటుంబానికి డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్ ల ద్వారా ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేశాడు. అయితే.. పూరి జగన్నాథ్ విషయంలో జరుగుతున్న ఈ కుట్రలపై ఓ అభిమాని రాసిన లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లెటర్ లో పూరి అభిమాని ఇలా రాసుకొచ్చాడు.

“అవును డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. నిజంగా ఓ మోసగాడు. పరువు తీసేద్దాం పదండి! ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్.. మైల్ స్టోన్స్ లాంటి సినిమాలను ఇచ్చి.. ఇప్పుడు ఇలాంటి కుట్రల మధ్య నలిగిపోతున్నందుకు ఖచ్చితంగా పరువు తీసేయాలి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ, ఒక్కో మార్క్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు కదా.. మోసగాడు అనే ముద్ర తప్పకుండా వేయాల్సిందే. దర్శకుడిగా, నిర్మాతగా తాను వందల కోట్లు నష్టపోయినా.. ఎప్పుడూ ఎవరి పేర్లు బయట పెట్టనందుకు, ఎవరినీ బాధ్యులను చేయకుండా పల్లెత్తు మాట కూడా అనకుండా ఉన్నందుకు పక్కాగా కుటుంబంతో సహా రోడ్డుకు లాగాలి. అవును.. తాను సమాజంలో పరువుగా బ్రతకాలని అనుకుని.. ఇన్నాళ్లు ఎవరి పరువు తీయకుండా ఉన్నందుకు బుద్దొచ్చేలా పరువు తీయాలి. తనను ఎంతోమంది మోసగించినా.. ఎన్ని ప్లాప్స్ వచ్చినా.. బ్లాక్ బస్టర్స్ తో బౌన్స్ బ్యాక్ అయ్యే డాషింగ్ డైరెక్టర్ ని ఇలాగే పరువు తీసి సత్కరించాలి.

జీవితంలో సంపాదించుకున్నవన్నీ ఓసారి కోల్పోయి.. మళ్లీ ఒకటి నుండి జీవితాన్ని స్టార్ట్ చేసి ఈ స్థాయికి ఎదిగి చూపించాడు. అలా ఆదర్శంగా నిలిచినందుకైనా మనం పూరి తాట తీసేయాలి. పదండి! ఇప్పటికైనా ఆలస్యం అయ్యింది లేదు.. గొప్ప సినిమాలు, గొప్ప హిట్స్ ఇచ్చినప్పుడు అన్నీ మూసుకొని.. ఆయన ఇంటి చుట్టూ తిరిగిన రోజులను మర్చిపోయి.. ఇప్పుడు విచక్షణ రహితంగా ప్రవర్తిద్దాం. ఎందుకంటే.. డబ్బుకున్న విలువ మనుషులకు లేని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం.. అది నిజమని ప్రూవ్ చేయడానికైనా పూరి జగన్నాథ్ పరువు తీసేద్దాం. మోసగాడు.. అనే ముద్రవేసి మళ్లీ ఆస్తులు అమ్ముకునేలా చేద్దాం.

లైగర్ సినిమాతో అందరికన్నా ఎక్కువగా నష్టపోయి.. అయినా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎక్జిబిటర్స్ కి ఎంతోకొంత అరేంజ్ చేస్తానని చెప్పిన మంచితనాన్ని నిందలు వేసి చంపేద్దాం! ఇంకోసారి ఇలా అన్ని కోల్పోయినా.. మంచితనంతో బ్రతకొద్దని, ఎవడ్ని లెక్క చేయొద్దని.. స్వార్థానికి ఎక్కువ వాల్యూ ఇవ్వుమని గుర్తుచేద్దాం. ఒక ఇడియట్, అమ్మానాన్న తమిళమ్మాయి, బద్రి, పోకిరి, దేశముదురు, బిజినెస్ మ్యాన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చినందుకు.. తనకు తానే సిగ్గుపడేలా తాట తీసేద్దాం! కానీ.. చివరిగా ఒక్కమాట అన్ని మంచి విషయాలను పక్కన పెట్టి, ఒక్క ప్లాప్ తోనే ఇన్నాళ్లు దాచుకున్న కుట్రలు, రాజకీయాలను బయటపెట్టారు. కాబట్టి.. పూరికి వ్యతిరేకంగా నిలిచిన డిస్ట్రిబ్యూటర్స్, ఎక్జిబిటర్స్ అందరికి హ్యాట్సాఫ్.

ఆల్రెడీ పూరి చెప్పినట్లుగానే సినీ ప్రపంచంలో పెద్ద గ్యాంబ్లింగ్ నడుస్తుంది. కాకపోతే సినిమా అనేది వ్యాపారంతో కూడిన జూదం. కొన్ని సినిమాలు ఆడతాయి.. కొన్ని పోతాయి. మామూలుగా సినిమాలు పోతే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇచ్చేవాళ్ళు చాలా అరుదు. అయితే.. లైగర్ విషయంలో నష్టపోయినందుకు డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగిచ్చేందుకు పూరి సిద్ధపడ్డాడు. ఆ విషయాన్నీ కూడా క్లియర్ గా చెప్పుకొచ్చాడు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. సినిమా పోయిందని చెప్పి డబ్బులు తిరిగి అడుగుతున్నారు.. అదే సినిమాలు బాగా ఆడి లాభాలు వస్తే.. వచ్చిన ఎక్కువ డబ్బులను తిరిగి ప్రొడ్యూసర్లకు ఇస్తారా? ఆలోచించాలి. కాస్త టైమ్ ఇస్తే అన్నీ సర్దుకుంటాయి. తొందరపడి ఓవరాక్షన్ చేస్తే ఎవ్వడి పనులు జరగవు. ఇది విదితమే అని చెబుతూ సెలవు!” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.


Tags :

  • latest tollywood news
  • Liger
  • Open Letter
  • Puri Jagannadh
  • social media viral
  • Tollywood Distributors
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

143 మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

143 మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

  • గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

    గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

    బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

  • నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

    నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam