Puneeth Rajkumar: దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. తమని విడిచి వెళ్ళినందుకు కోట్లాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారు. చిన్న వయసులో మరణించడంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. అయినప్పటికీ పునీత్ ఎప్పుడూ తమ గుండెల్లోనే జీవించి ఉంటారని అభిమానులు అభిప్రాయపడ్డారు. అలాంటి అభిమానులకు ట్విట్టర్ సంస్థ షాకిచ్చింది. కన్నడ ప్రజలు ఎంతగానో గౌరవించుకునే తమ అభిమాన నటుడు పునీత్ ను ట్విట్టర్ సంస్థ అవమానించింది.
పునీత్ రాజ్ కుమార్ ట్విట్టర్ అఫీషియల్ హేండిల్ కి సంబంధించి బ్లూ టిక్ ను తొలగించింది. అది గమనించిన అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. రాజ్ కుమార్ అఫీషియల్ ప్రొఫైల్ నుండి బ్లూ టిక్ మిస్ అయ్యిందని తెలుసుకున్న కొంతమంది అభిమానులు ట్విట్టర్ సైట్ పై వార్ ప్రకటించారు. బ్లూ టిక్ ఎందుకు తొలగించారంటూ ట్విట్టర్ ను ప్రశ్నిస్తున్నారు. “సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సిద్దార్థ్ శుక్ల వంటి నటులు మరణించినప్పటికీ.. వారి అకౌంట్ల నుండి బ్లూ టిక్ ను తొలగించలేదు. అలాంటప్పుడు పునీత్ యొక్క ఖాతా నుండి బ్లూ టిక్ ఎందుకు తొలగించారు” అంటూ మండిపడుతున్నారు.
రీసెంట్ గా ఎంతోమంది మరణించినప్పటికీ వారి అఫీషియల్ ఖాతాలకు బ్లూ టిక్ ఉన్నప్పుడు.. పునీత్ ఖాతా నుండి బ్లూ టిక్ తొలగించడం కరెక్ట్ కాదని అంటున్నారు. తమ అభిమాన నటుడి ఖాతాను వీలయినంత త్వరగా వెరిఫై చేయాలని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ తో కలిసి చాలా సినిమాలకు పని చేసిన ఫిల్మ్ మేకర్ సంతోష్ ఆనంద్ రామ్.. త్వరగా తమ అభిమాన నటుడి ఖాతాను వెరిఫై చేయవలసిందిగా ట్విట్టర్ ను కోరారు. ఆయన ఇంకా అభిమానుల గుండెల్లో జీవించే ఉన్నారని, ఎవరూ ఆయన లేరు అని ఫీలవ్వడం లేదని, ఈరోజు నాతో పాటు ఎంతోమంది అభిమానులు ఆయన ఖాతాను వెరిఫై చేయమని కోరుతున్నట్లు ఆనంద్ రామ్ వెల్లడించారు.
గొప్ప నటులకి, గొప్ప వ్యక్తులకి మరణం అనేది ఉండదు. భౌతికంగా వాళ్ళు దూరమైనా గానీ వారు మాత్రం ప్రజల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. మరి ట్విట్టర్ సంస్థ ఈ విషయం మీద దృష్టి సారించి పునీత్ విషయంలో చేసిన తప్పును సరిద్దుకుంటుందా? లేదా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Raghava Lawrence: రజినీకాంత్ కాళ్లు మొక్కి షూటింగ్ మొదలు పెట్టిన లారెన్స్!
Requesting @verified @Twitter @TwitterIndia pls do reverify @PuneethRajkumar sir’s official Twitter account,He is alive in Ppl heart,Ppl never felt he is no more! till today many people including me tag his account in posting posts related to him!#ReverifyPuneethRajkumarTwitter
— Santhosh Ananddram (@SanthoshAnand15) July 15, 2022
Restore verification badge for @PuneethRajkumar twitter handle@verified @TwitterIndia #PuneethRajkumar pic.twitter.com/TvfpCWBNn0
— Husenbadsha Jamadar (@alwaysbadsha) July 15, 2022
Requesting @verified@Twittera@TwitterIndia
pls do reverify @PuneethRajkumar
sir’s official Twitter account,He is alive in Ppl heart,Ppl never felt he is no more! till today many people including me tag his account in posting posts related to him!#ReverifyPuneethRajkumarTwitte— Yashas Kumar C N (@YashasKumar267) July 15, 2022