సెలబ్రిటీలకు సంబంధించిన వార్తల గురించి అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. మరీ ముఖ్యంగా వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. వారి ప్రేమ, పెళ్లి వంటి వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ క్రమంలో తాజాగా ఓ సీరియల్ నటి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. సదరు నటి, నిర్మాతను పెళ్లి చేసుకుంది. ఆసక్తికర అంశం ఏంటంటే.. వీరిద్దరికి ఇది రెండో వివాహం. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
కోలీవుడ్ నిర్మాత రవిందర్ చంద్రశేఖర్.. సీరియల్ నటి, వీజే మహాలక్ష్మీ గురువారం చెన్నైలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కొన్ని రోజుల క్రితం తమ భాగస్వాములతో విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం, ప్రేమ.. అది పెళ్లి పీటల వరకు వచ్చింది. ఇక ఇరు కుటుంబాల సమక్షంలో.. అతి కొద్ది బంధువుల మధ్య వీరి వివాహం జరిగింది.
ప్రస్తుతం నిర్మాత రవిందర్ రూపొందిస్తున్న రెండు సినిమాల్లోనూ మహాలక్ష్మీ నటిస్తోందని సమాచారం. గతంలో ఈమె బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించింది. మరీ ముఖ్యంగా ‘వాణి రాణి’ వంటి స్టార్ సీరియల్స్‌లో మహాలక్ష్మికి మంచి పాత్రలు దక్కాయి. వాటితో ఆమెకు మంచి గుర్తింపు రావడమేకాక.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.