పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయినటువంటి డార్లింగ్ ప్రభాస్.. వరుసగా ఒక్కో సినిమాను విడుదలకు సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఏకకాలంలో రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇటీవల ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు రెడీ అయిపోయింది. ఈ సినిమా మార్చి మొదటి వారంలో రిలీజ్ కానుందని ప్రచారం కూడా జరుగుతోంది.
ప్రస్తుతం ప్రభాస్ అటు ఆదిపురుష్(రామాయణ ఇతిహాస నేపథ్యం), ఇటు సలార్(మాఫియా యాక్షన్) సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. అయితే.. సలార్ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారని వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా సలార్ నుండి ప్రభాస్ లేటెస్ట్ వర్కింగ్ స్టిల్స్ లీక్ అంటూ కొన్ని ఫోటో, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Denamma okeroju rendu vachai entraaa naku #Salaar leaked video #Prabhas https://t.co/5JugNWWJHD pic.twitter.com/pPZ56AX55z
— Saiteja🔔❁ (@Saiteja76366652) January 29, 2022
ప్రభాస్ లీకెడ్ ఫోటో, వీడియో చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక ప్రభాస్ సలార్, ఆదిపురుష్ లతో పాటు ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలను లైనప్ చేశాడు. ప్రస్తుతానికి పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాలు పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ అవుతాయని ఇండస్ట్రీ టాక్. ఇక సలార్ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా.. విజయ్ కిరగందుర్ సినిమాను నిర్మిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి సలార్ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Salaar leaked video pic.twitter.com/h0WJnSpP0J
— Bheeshma Talks (@BheeshmaTalksss) January 29, 2022