పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోకి సమయం ఆసన్నమైంది. నటసింహం బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ షో దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల ప్రభాస్ అన్ స్టాపబుల్ కి వస్తున్నాడని తెలిసి ఫ్యాన్స్ అందరిలో ఎక్కడలేని ఉత్సాహం నెలకొంది. దీంతో ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ప్లాన్ చేసి డిసెంబర్ చివరిలో ఒకటి.. జనవరి ఆరంభంలో ఒకటి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ.. ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఆహా వారు టైమ్ ని మార్చేసి సడన్ గా డిసెంబర్ 29నే రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే చాలామంది హీరోలు పాల్గొన్న ఈ షో.. సెకండ్ సీజన్ మరింత విజయవంతంగా రన్ చేస్తున్నారు. అదే ఉత్సాహంతో పాన్ ఇండియా స్టార్ నుండి పవర్ స్టార్ వరకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. బాహుబలి బిగినింగ్, కంక్లూజన్ లాగా ప్రకటించారు. అయితే.. గురువారం రాత్రి చెప్పిన సమయానికి ఫ్యాన్స్, ఆహా సబ్ స్క్రైబర్స్ అంతా ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ.. ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైనట్లు తెలుస్తోంది. బాలయ్య – ప్రభాస్ ల స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వట్లేదని, ఆహా యాప్ కూడా ఓపెన్ అవ్వట్లేదని ఫ్యాన్స్ అంటున్నారు.
మరి టెక్నికల్ గా ఆహా ఒటిటిలో ఏదైనా ప్రాబ్లెమ్ ఏర్పడిందా? లేకపోతే వేరే ఏదైనా రీసన్స్ వల్ల యాప్ ఓపెన్ అవ్వలేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇప్పుడు స్ట్రీమింగ్ అవ్వకపోతే ఏ టైమ్ లో రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్, నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ ఎపిసోడ్ కోసం జనాలు కూడా ఎగబడ్డారని.. అందుకే సర్వర్ డౌన్ అయిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆహా వారు నిరాశే మిగిల్చారని అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మరి ఫస్ట్ ఎపిసోడ్ ఏ టైమ్ లో అందుబాటులోకి రానుందో చెబితే బాగుంటుందని అంటున్నారు. చూడాలి మరి ప్రభాస్ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో!