పూజా హెగ్దే.. బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా అంటూ పాన్ ఇండియా స్థాయిలో బంగారు బొమ్మ అయిపోయింది. ఆమె పట్టిందల్లా బంగారం అవుతోంది. ఒక్క రాధేశ్యామ్ డివైడ్ టాక్ మినహా.. రీసెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ హిట్ టాక్ తెచ్చి పెట్టాయి. అంతేకాకుండా ఏప్రిల్ 29న విడుదలకానున్న ఆచార్య సినిమాతో ఆమె రేంజ్ మరోస్థాయికి చేరుకోనుంది. ఆచార్యలో అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయిలా పూజా అందరినీ కట్టిపడేసింది. ఇప్పటికే పూజా హెగ్దే రేంజ్ పెరిగిపోయింది అని సమర్ధించేలా ఓ టాక్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.
ఇదీ చదవండి: మందు తాగుతాను.. ఆ టైంలోనే కథలు రాస్తాను: కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్
అదేంటంటే.. విక్టరీ వెంకటేశ్– మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- అనీల్ రావిపూడి కాంబినేషన్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఎఫ్-2కి సీక్వెన్స్ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సీక్వెన్స్ సినిమా అయిన ఎఫ్-3లో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ చేస్తోంది అనేది టాక్. అంతవరకే అయితే అది టాక్ ఆఫ్ ది టౌన్ ఎందుకు అవుతుంది? ఆ సాంగ్ కోసం పూజా ఏకంగా కోటి నుంచి కోటిన్నర డిమాండ్ చేసిందంట. అయితే ఆమె అడిగిన మొత్తం ఇచ్చేందుకు మేకర్స్ కూడా ఓకే అనేశారని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒక్కపాటకే కోటిన్నర అంటే ఇంక రాబోయే సినిమాలకు ఏ రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకుంటుందో అని ముక్కున వేలేసుకుంటున్నారు. పూజా హెగ్దే షాకింగ్ రెమ్యూనరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
Lets get this party started💃
The Ravishing beauty @hegdepooja joins #F3Movie to add spice to our SPECIAL PARTY SONG🎶#F3OnMay27@VenkyMama @IAmVarunTej@AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @ThisIsDSP @SVC_official @adityamusic @f3_movie pic.twitter.com/70N97CPVce
— SumanTV (@SumanTvOfficial) April 15, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.