సినీ జగత్తు యావత్తు.. ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న ఆ తరుణం మరి కొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. మరి కొన్ని గంటల్లో ఈ ఏడాది ఆస్కార్ ఎవరు గెలిచారో తేలనుంది. అలానే 130 మంది భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రిజల్ట్ మరి కాసేపట్లో రానుంది. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డ్‌కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..
సినీ ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా ఎదురు చూస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మక వేడుక.. ఆస్కార్ అవార్డుల ప్రదానం. ఈ సారి ఈ వేడుక కోసం 130 కోట్ల మంది భారతీయులు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సారి ఆస్కార్ బరిలో తెలుగు చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజనల్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. మరి కొన్ని గంటల్లో ఫలితం తేలనుంది. ఆస్కార్‌కు ఓ తెలుగు సాంగ్ నామినేట్ అవ్వడం పట్ల ఇప్పటికే తెలుగు జాతి గర్వంగా ఫీలవుతుంది. అవార్డు వస్తే సంతోషిస్తాం. రాకపోయిన పర్లేదు.. పోటీ ఇచ్చాము కదా. ఇక ప్రస్తుతం ఫిలిం నగర్‌లో ఈ ఆస్కార్ అవార్డుపై టాలీవుడ్ ప్రముఖుల మధ్య రచ్చ నడుస్తోంది. ఆ సంగతి కాసేపు పక్కన పెడితే.. ఆస్కార్ అవార్డుకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలు..
ఆస్కార్ అవార్డును సినీ ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావిస్తారు. అవార్డు అందుకోవడమే కాదు.. నామినేట్ అవ్వడాన్ని కూడా చాలా గ్రేట్‌గా ఫీలవుతారు. 2023 ఆస్కార్ బరిలో ఆర్‌ఆర్‌ఆర్ మూవీలోని నాటు నాటు పాట నిలవడం తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇక ఆస్కార్ అవార్డును 1929లో డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీలు అకాడమీ అవార్డ్స్ పేరుతో ప్రారంభించారు. సినీ పరిశ్రమలో విశిష్ట ప్రతిభ కనబర్చినవారికి ఈ అవార్డు ఇచ్చేవారు. ప్రారంభంలో ఇది సామాన్యమైన అవార్డుగా మొదలై.. కాలక్రమంలో సినీ జగత్తులో ఇదే అత్యున్నత పురస్కారంగా మారిపోయింది. మరి చిత్ర పరిశ్రమలో నోబెల్‌లా భావించే ఈ ఆస్కార్ అవార్డును అమ్మకోవచ్చా.. ఒకవేళ అమ్మితే ఎంత వస్తుందో తెలిస్తే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు.
ఆస్కార్ అవార్డ్ చూడ్డానికి బంగారు రంగులో పసిడితో చేసినట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి అది బంగారంతో చేసిన ప్రతిమ కాదు. 30.5 అంగుళాల ఎత్తు, 4 కిలోల బరువుండే ఈ అవార్డు రాగితో తయారవుతుంది. ఆపైన ప్రతిమ మీద బంగారం పూత పూస్తారు. ఇక ఆస్కార్ అవార్డు తయారు చేసేందుకు 400 డాలర్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. మరి అమ్మితే ఎంత వస్తుందో తెలుసా.. కేవలం ఒకే ఒక్క డాలర్. అవును మీరు విన్నది నిజమే.. ఇంత ప్రతిష్టత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు అమ్మితే కేవలం ఒక్క డాలర్ మాత్రమే వస్తుంది. మరి ఇంత తక్కువ ఎందుకంటే.. దీని వెనక ఒక బలమైన కారణం ఉంది.
ఆస్కార్ అవార్డు విలువ ఒక్క డాలర్‌గా ఉండటానికి ప్రధానం 1950లో అకాడమీ ప్రవేశపెట్టిన నిబంధననే. 1950కు ముందు ఓ అమెరికన్ డైరెక్టర్ తాను గెల్చుకున్న ఆస్కార్ అవార్డును వేలం వేయగా.. ఏకంగా ఆరున్నర కోట్లు వచ్చాయతనికి. ఈ విషయం కాస్త బయటకు లీకవ్వడంతో.. ఆగ్రహించిన అకాడమీ అవార్డ్స్ కమిటీ.. భవిష్యత్తులో ఎవరు ఇలాంటి పని చేయకుండా ఉండేందుకు.. అనగా ఆస్కార్ అవార్దును అమ్మకుండా ఓ నిబంధన ప్రవేశపెట్టింది. ఒకవేళ ఎవరైనా తమకు వచ్చిన ఆస్కార్ అవార్డ్‌ను అమ్మాలనుకున్నా, వేలం వేయాలనుకున్నా కుదరదు. ఆ హక్కు కేవలం అకాడమీకే ఉంటుంది. అది కూడా 1 డాలర్ మాత్రమే విలువ కట్టారు. అంటే ఆస్కార్ అవార్డు అమ్మితే కేవలం 82 రూపాయలే వస్తాయి అన్నమాట. అయినా ఎంతో ప్రతిష్టత్మాకంగా భావించే ఆస్కార్ అవార్డును ఎవరు అమ్మాలనుకోరు కదా. మరి ఆస్కార్ కమిటీ తీసుకువచ్చిన నిబంధనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.