ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సీరియస్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా యువనటి మేఘాంజన దాస్ కన్నుమూశారు. కేవలం 25 ఏళ్ళ వయసులోనే ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ ఒడియా ఆల్బమ్ నటి మృతి చెందడంతో అటు కుటుంబంలో, ఇటు ఫ్యాన్స్ లో విషాద ఛాయలు పులుముకున్నాయి. కొంతకాలం క్రితం ప్రాణాంతకమైన బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో.. మేఘాంజన బరిపడలోని పండిట్ రఘునాథ్ ముర్ము హాస్పిటల్ లో చేరారు.
ఆ తర్వాత ఆమెను కటక్ లోని SCB హాస్పిటల్ కు తరలించగా, అక్కడ ఆమె కోమాలోకి వెళ్లింది. రోజురోజుకూ మేఘాంజన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో.. వైద్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. బరిపాడలోని తన నివాసానికి తీసుకొచ్చిన కొన్ని గంటలకే ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
ఇక మేఘాంజన అకాల మరణంతో పలువురు ప్రముఖ కళాకారులు, సెలబ్రిటీలు బరిపడలోని ఆమె ఇంటికి చేరుకొని నివాళులర్పించారు. ఇదిలా ఉండగా.. బరిపడ పట్టణంలో నివసించే అపర్ణ సాహూ, అజయ్ కుమార్ దాస్ దంపతులకు జన్మించిన మేఘాంజన.. డ్యాన్స్ లో శిక్షణ పొందింది. తన కెరీర్ లో తాను కనబర్చిన నటనకు, డాన్సింగ్ స్కిల్స్ కి అనేక అవార్డులను అందుకుంది. ఇక మేఘాంజన దాదాపు 200కు పైగా సంతాలి, ఝుమర్ ఆల్బమ్ లలో నటించినట్లు తెలుస్తుంది. మరి మేఘాంజన అకాల మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.