‘అమ్మ, అవకాయ, అంజలిని మర్చిపోవడం అంతా ఈజీ కాదు’.. ఈ డైలాగ్ రాసిన డైరెక్టర్ త్రివిక్రమ్ ని మర్చిపోవడం కూడా అంత సులభం కాదు. ఏంటో తెలుగు సినిమా ప్రేక్షకుల తత్వమే అంతా. నచ్చితే అవతల మనిషి ఎవరైనా సరే గుండెల్లో పెట్టేసుకుంటారు. మన రోజువారీ జీవితంలో భాగమైన సినిమాలు, వాటిని తీసే డైరెక్టర్లను అయితే ఇంకా ఎక్కువగా ఆరాధిస్తారు. చాలామంది స్టార్ హీరోలకు అభిమానులున్నట్లే.. త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి కూడా వీరాభిమానులున్నారు. ఆయన సినిమాల్ని రిపీట్స్ లో చూస్తారు. ఆయన రాసిన డైలాగ్స్ ని నిద్రలో లేపి అడిగినా గుక్క తిప్పుకోకుండా చెబుతారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. త్రివిక్రమ్ అంటే పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్. తెలుగు సినిమాలు చూసే ఎవరిని అడిగినా సరే ఈ విషయం బల్లగుద్ది మరీ చెబుతారు. ఇక ఆయన పుట్టినరోజు వస్తే చాలు సోషల్ మీడియా మొత్తం ఆయన రాసిన డైలాగ్స్, విషెస్ తో నింపేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. హీరోల పుట్టినరోజుల సందర్భంగా వాళ్లు నటించిన పాత హిట్ సినిమాల్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఫర్ ది ఫస్ట్ టైమ్.. ఈ లిస్ట్ లోకి ఓ డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. అతడే త్రివిక్రమ్.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన తొలి మూవీ ‘నువ్వే నువ్వే’ రీసెంట్ గానే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని.. త్రివిక్రమ్ బర్త్ డే(నవంబరు 7) సందర్భంగా నవంబరు 4-7వ తేదీల వరకు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో హీరోలకే మాత్రమే పరిమితమైన ఈ ట్రెండ్ లోకి త్రివిక్రమ్ వచ్చినట్లయింది. దీంతో ఆయన అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. ఇక త్రివిక్రమ్ విషయానికొస్తే.. ఓ సినిమా చూస్తే అందులో డైలాగ్స్ ని కొన్నాళ్ల తర్వాత మర్చిపోతాం. మరీ సూపర్ హిట్ సినిమా అయితే తప్పించి పెద్దగా గుర్తుంచుకోం. కానీ త్రివిక్రమ్ సినిమాలు, అందులోని డైలాగ్స్ వీటికి అతీతం.
ఎందుకంటే త్రివిక్రమ్ పెన్ పవర్ అలాంటిది. మన చుట్టూ ఉన్న పరిస్థితులను తీసుకుని ఆయన రాసిన ప్రతి డైలాగ్ కూడా అది కామెడీ కావొచ్చు, ఎమోషనల్ కావొచ్చు. ఎన్నిసార్లు విన్నా, ఏ సందర్భంలో విన్నా సరే అది ఫ్రెష్ గానే ఉంటుంది. ఫస్ట్ టైమ్ చూసినంత కిక్కిస్తుంది. ఆయన పేర్చిన మాటల ముత్యాలు ఉన్న సినిమాలు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దీనితో పాటు ఆయన పేరులోనే ఏదో తెలియని పంచ్ ఉంది. డైరెక్టర్ త్రివిక్రమ్ అయితే చాలు.. హీరోతో సంబంధం లేకుండా సినిమాకు ఫ్యాన్స్ ఎగబడతారు. ఇలా మాటల మాంత్రికుడు గురించి ఎంత చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా తక్కువే. అందుకే ఆయన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ స్పెషల్.
On the occasion of director #Trivikram‘s birthday on Nov 7th, we are extremely excited to re-release his debut blockbuster #NuvveNuvve in theaters across AP & TG from 4th – 7th November at the request of his fans.
Enjoy the #Guruji‘s masterclass on the big screen ! pic.twitter.com/lFIzdB1gyn
— Sri Sravanthi Movies (@SravanthiMovies) November 1, 2022