నటీనటుల కెరీర్ లో గుడ్ మెమోరీస్ తో పాటు చేదు అనుభవాలు కూడా ఉంటాయి. మంచి విషయాలంటే ఎప్పుడైనా షేర్ చేసుకుంటారు. కానీ.. చేదు అనుభవాలను ఎవరైనా సరే సమయం వచ్చినప్పుడు మాత్రమే బయట పెడుతుంటారు. ఒక్కోసారి తోటి నటుల వలన కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు హీరోయిన్స్. ఈ విషయంలో తానేమి మినహాయింపు కాదంటోంది స్టార్ ఐటమ్ బ్యూటీ, మోడల్ నోరా ఫతేహి.
చిత్రపరిశ్రమకు సంబంధించి నటీనటుల కెరీర్ లో గుడ్ మెమోరీస్ తో పాటు చేదు అనుభవాలు కూడా ఉంటాయి. మంచి విషయాలంటే ఎప్పుడైనా షేర్ చేసుకుంటారు. కానీ.. చేదు అనుభవాలను ఎవరైనా సరే సమయం వచ్చినప్పుడు మాత్రమే బయట పెడుతుంటారు. కొన్నిసార్లు మనం ఫ్యాన్స్ వలన హీరోయిన్స్ ఇబ్బందులు పడ్డారని లేదా క్యాస్టింగ్ కౌచ్ లో ప్రాబ్లెమ్స్ ఫేస్ చేశారని వింటుంటాం. ఎప్పుడూ ఇవేకాదు.. ఒక్కోసారి తోటి నటుల వలన కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు హీరోయిన్స్. ఈ విషయంలో తానేమి మినహాయింపు కాదంటోంది స్టార్ ఐటమ్ బ్యూటీ, మోడల్ నోరా ఫతేహి.
ఇటీవల ప్రముఖ బాలీవుడ్ ఎంటర్టైన్ మెంట్.. కపిల్ శర్మ షోలో పాల్గొన్న నోరా.. తన కెరీర్ లో ప్రారంభంలోనే తనకు చేదు అనుభవం ఎదురైందని చెప్పి అందరికి షాకిచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. షూటింగ్ టైమ్స్ లో ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? అని అడిగ్గా.. “నాకు ఫ్యాన్స్, ఆడియెన్స్ వల్ల ఇబ్బందేం లేదు. నా తోటి నటుడి వల్ల ఇబ్బంది పడ్డాను. నా ఫస్ట్ సినిమా షూటింగ్ బాంగ్లాదేశ్ లోని సుందర్బన్ అడవుల్లో జరిగింది. ఆ టైంలో నాతో కో-యాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో వెంటనే నేను అతన్ని లాగిపెట్టి కొట్టాను. అయితే.. వెంటనే అతను నన్ను తిరిగి కొట్టాడు. ఆ తర్వాత నేను మళ్లీ కొట్టాను. అప్పుడతను నా జుట్టు పట్టుకొని లాగాడు. వెంటనే నేను అతని జుట్టు పట్టుకొని లాగాను.. అలా మా ఇద్దరి మధ్య సెట్ లోనే పెద్ద గొడవైంది. అప్పుడు డైరెక్టర్ వచ్చి మమ్మల్ని ఆపాడు” అని చెప్పింది నోరా.
ప్రస్తుతం నోరా మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా.. నోరా 2014లో ‘రోర్;ది టైగర్స్ ఆఫ్ సుందర్బన్’ మూవీతో బాలీవుడ్ డెబ్యూ చేసింది. ఆ తర్వాత తెలుగులో టెంపర్ సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా అడుగుపెట్టిన నోరా.. బాహుబలి, కిక్ 2, లోఫర్, ఊపిరి లాంటి సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేసి సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఓవైపు ఐటమ్ సాంగ్స్, సినిమాలు చేస్తూనే.. మరోవైపు సూపర్ హాట్ మోడల్ గా వరల్డ్ వైడ్ పాపులారిటీ దక్కించుకుంది. ఈ క్రమంలో కపిల్ శర్మ షోలో పాల్గొన్న నోరా.. తన కెరీర్ ఆరంభంలోనే చేదు అనుభవం ఎదురైందని గుర్తు చేసుకుంది. ఇక హీరోయిన్స్, ఫిమేల్ ఆర్టిస్ట్ ల విషయంలో ఇలాంటివి రెగ్యులర్ గా వింటుంటాం. మరి ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.