తెలుగు ఇండస్ట్రీలోకి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్. ఆ తర్వాత నిఖిల్ నటించిన చిత్రాలు వరుస విజయాలు అందుకున్నాయి. ప్రతిసారి చాలా సెలెక్టెడ్ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ పెంచుకుంటున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, కలర్స్ స్వాతి నటించిన కార్తికేయ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం సీక్వెల్ గా రూపొందిన ‘కార్తికేయ 2’ బ్లాక్ బస్టర్ అయ్యింది. చిన్న చిత్రంగా రిలీజ్ అయిన కార్తీకేయ 2 పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ షేక్ చేసి ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది.
ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా ఘన విజయం అందుకుంది. కార్తికేయ మూవీ థియేట్రికల్ రిలీజ్ తో దేశవ్యాప్తంగా సూపర్ హిట్ కావడమే కాదు.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కూడా సత్తా చాటుతుంది. ఈ చిత్రం వీక్షించిన గుజరాత్ సీఎం, బాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో పాటు పలువురు ప్రముఖులు కార్తికేయ 2 టీమ్ ని అభినందించారు. ఇలాంటి అడ్వెంచర్ డ్రామా చిత్రాలు మరెన్నో రావాలని ప్రేక్షకులు ఇలాంటి చిత్రాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని ప్రశంసించారు. నిఖిల్ నటించిన కార్తికేయ 2 కి మరో అరుదైన గౌరవం లభించింది.
కార్తికేయ 2 చిత్రం అమెరికాలో అద్భుత విజయం సాధించింది. ఈ క్రమంలో న్యూ జెర్సీ ఎడిసన్ మేయర్ సామ్ జోషి హీరో నిఖిల్ కి సిద్దార్థను అభినందించారు. తమ కార్యాలయం తరుపు నుంచి ప్రశంసా పత్రాన్ని అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘కార్తికేయ 2 చిత్రంలో నిఖిల్ అద్భుత నటన ప్రదర్శించారని.. అతని నటన చూసి మేం ఎంతో గర్విస్తున్నామని అందుకే అతనికి ఈ గౌరవం దక్కిందని ’అన్నారు.
ఇంత గొప్ప గౌరవాన్ని అందుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందని.. నా నటనను మెచ్చుకున్నందుకు ఎంతో గర్వంగా ఉందని ఇన్ స్ట్రాలో పేర్కొన్నాడు నిఖిల్. కొంత కాలంగా యాక్షన్, థ్రిల్లరో జోనర్ లో నటిస్తూ వచ్చిన నిఖిల్ ప్రస్తుతం 18 పేజిస్ చిత్రంలో నటిస్తున్నాడు. లవ్ అండ్ రొమాంటిక్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.