నిహారిక కొణిదెల.. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా పరిచయమై.. నిర్మాతగా హిట్టు కొట్టిన వ్యక్తి. మెగా బ్రదర్ నాగబాబు కూతురు. చైతన్యతో నిహారిక వివాహం జరిగింది. ఆమె ప్రస్తుతం తన భర్త చైతన్యతో కలిసి విదేశి పర్యాటనలో ఉంది. పెళ్లై ఏడాది పూర్తి కానున్న సందర్భంగా విదేశాల టూర్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. మొత్తానికి నిహారిక మాత్రం స్పెయిన్, బార్సిలోనాలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వెకేషన్ మూడ్ లో భాగంగా నిహారిక స్కై డైవింగ్ చేసింది. ఈ డైవింగ్ తో నేను ఒక్కసారిగా పారవశ్యానికి లోనయ్యానని, నా జీవితంలో మరచిపోలేని సాహసం ఇదని నిహారిక తెలిపారు. ఆమె చేసిన స్కైడైవింగ్ సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇప్పుడు ఈ వీడియో నెటింట్లో తెగ వైరల్ అవుతుంది.
నిహారిక నిర్మాతగా హిట్ కొట్టేసి..ఓసీఎఫ్ఎస్ అనే వెబ్ సిరీస్ తో ఫుల్ స్పీడులో దూసుకుపోతోంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మీద తీసిన ఈ వెబ్ సిరీస్ పై నిహారికాను మెగా స్టార్ చిరంజీవి అభినందించిన విషయం తెలిసిందే. అలా ఈ చిన్న ఫ్యామిలీ స్టోరీ పెద్ద హిట్ అయింది. మొత్తానికి నిహారికకు చాలా రోజుల తరువాత ఓ సక్సెస్ వచ్చింది. రిలాక్సేషన్ కోసం నిహారిక, చైతన్యలు స్పెయిన, బార్సినాలో పర్యటించారు. అందులో భాగంగా నిహారిక స్కైడైవింగ్ చేశారు. నిహారిక కొణిదెల చేసిన ఈ స్కైడైవింగ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.