తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునే కామెడీ షోల్లో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. జబర్దస్త్ వంటి కామెడీ షో కు పోటీగా వచ్చిన ఈ షో.. ప్రేక్షకులను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రతి ఆదివారం ప్రసారమైయే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’.. ఎంటర్టైన్ పరంగా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసిందని చెప్పొచ్చు. ఎప్పుడూ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఆకట్టుకునే ఈ షో.. ఈసారి బోనాలు కాన్సెప్ట్ తో రానుంది. అందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
ప్రస్తుతం తెలంగాణ మొత్తం బోనాల జాతరలో మునిగిపోయి ఉంది. ఈ సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ బోనాల స్పెషల్ గా రూపొందించారు.ఈ ఎపిసోడ్ కు.. కార్తికేయ 2 ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ పరమేశ్వరన్, హీరో నిఖిల్ విచ్చేసి సందడి చేసారు. యాక్టింగ్ ఒక్కటే కాదు.. సింగింగ్ టాలెంట్ కూడా ఉన్న అనుపమ, తన సూపర్ హిట్ మూవీ శతమానం భవతి చిత్రంలోని మెలోడీ సాంగ్ అద్భుతంగా పాడారు. ఈ క్రమంలో అనుపమ.. చిన్నప్పుడు బోనాల జాతరలో తన బావ తప్పిపోయాడని చెప్పగా.. ఇమ్మానియేల్ ఆ తప్పిపోయిన బావను నేనే అని చెప్తాడు.
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ డూప్స్ తో కొన్ని స్పెషల్ సాంగ్స్ ప్లాన్ చేశారు. అలా ఎపిసోడ్ మొత్తం సందడిగా సాగింది. ఓ సాంగ్ కి హైపర్ ఆది, కనకవ్వ పెర్ఫార్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రష్మీ.. హైపర్ ఆది, కనకవ్వ వద్దకు వచ్చి, కనకవ్వతో పెర్ఫార్మ్ చేయడం ఎలా ఉందని అడిగింది. దానికి హైపర్ ఆది, కనకవ్వకు కళ్ళతో రొమాంటిక్ సైగలు చేశాడు. హైపర్ ఆది చిలిపి సైగలకు గంగవ్వ కళ్ళతోనే ఏంటి అంటూ ప్రశ్నించింది. ఇక హైపర్ ఆది చేష్టలు శృతి మించడంతో నాలుక కొరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కనకవ్వ డేర్ కి సెట్ లోని వారందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: షోలో భార్యను పరిచయం చేసిన కమెడియన్ రియాజ్!