గత కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నరేష్-పవిత్రా లోకేష్‌ల పేర్లు మారుమోగిపోతున్నాయి. వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెను సంచలనం సృష్టించింది. ఇక తాజాగా పెళ్లి చేసుకుని అందరికి ఊహించని షాక్ ఇచ్చారు ఈ జంట. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉందంట. ఆ వివరాలు..
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్ర వివాహం బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా నరేష్ పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం వీరి పెళ్లి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక నరేష్-పవిత్రల రిలేషన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొద్ది నెలలుగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నరేష్ గతంలో మూడు వివాహాలు చేసుకున్నాడు. ప్రస్తుతం మూడో భార్య రమ్య రఘుపతితో కూడా విడిపోయాడు. వీరిద్దరికి ఇంకా లీగల్‌గా విడాకులు రాలేదు. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఇక నరేష్ తనను మోసం చేశాడని.. అతడికి విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని రమ్య రఘుపతి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు నరేష్.. రమ్య రఘుపతి గురించి దారుణమైన ఆరోపణలు చేశాడు. అంతేకాక ఆమె తనను చంపడానికి ట్రై చేస్తోందని బాంబ్ పేల్చాడు. ఇక ఈ ఏడాది కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా నరేష్-పవిత్రలు తమ బంధం గురించి అధికారిక ప్రకటన చేశారు. లిప్‌లాక్‌తో ప్రపంచాన్ని షేక్ చేశారు. ఇక రమ్య తనను 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందని.. ఆమొత్తం ఇస్తేనే విడాకులు ఇవ్వడానికి అంగీకరిస్తానని తనను బెదిరించిందని నరేష్ తెలిపాడు.
ఇక తాజాగా వీరి ప్రేమ కథలో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పవిత్ర-నరేష్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన నరేష్.. ‘‘ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. కొత్త ప్రయాణం ప్రారంభించాం. మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం’’ అంటూ పెళ్లి వీడియోని షేర్ చేసి.. మరోసారి రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేశాడు. ప్రస్తుతం వీరి పెళ్లి వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇదిలా ఉంటే.. నరేష్-పవిత్రల పెళ్లి గురించి హేమ నిదధానా అనే ట్విట్టర్ యూజర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక సదరు యూజర్ ఈ పెళ్లికి సంబంధించి షాకింగ్ విషయం వెల్లడించింది. ఈ పెళ్లి వీడియో నిజమైనది కాదని.. సినిమా షూటింగ్‌లో భాగంగా తీసిన వీడియోని నరేష్ పోస్ట్ చేశాడని ట్వీట్ చేసింది. ‘‘పవిత్ర బంధం అంటూ ఈ రోజు ట్విట్టర్‌లో నరేష్ పెళ్లి వీడియో షేర్ చేశాడు. అయితే రెండు నెలల క్రితమే నరేష్ వివాహం చేసుకున్నాడు. ఈ వీడియో ఇంకా పేరు ఖరారు చేయని ఒక సినిమాకు సంబంధించింది. సినిమాకు నిర్మాత ఎం ఎస్ రాజు ’’అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.
ఈ ట్వీట్‌ని బట్టి చూస్తే.. పవిత్ర-నరేష్‌లు రెండు నెలల క్రితమే సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. పెళ్లి విషయాన్ని వెల్లడించడానికి సినిమాలో తీసిన వీడియోని వాడుకున్నారు అని అర్థం అవుతోంది. ఇక నెటిజనులు కూడా సదరు ట్విట్టర్ యూజర్ చేసిన పోస్ట్‌తో ఏకీభవిస్తున్నారు. రమ్య రఘుపతికి విడాకులు ఇవ్వకుండా.. ఈ వయసులో అందునా నాలుగో పెళ్లి.. ఇంత గ్రాండ్‌గా చేసుకునే అవకాశాలు చాలా తక్కువ. ఇంత జరుగుతుంటే రమ్య రఘుపతి ఊరుకోదు కదా. అందుకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని.. ఈవీడియో ద్వారా ఆ విషయాన్ని వెల్లడించారు అని కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరు నెటిజనులు మాత్రం కాదు నిజంగానే వారిద్దరూ గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాక ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం దుబాయ్ వెళ్లారట. మరి నిజంగానే పవిత్ర-నరేష్‌ల వివాహం జరిగిందా.. లేక సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని.. ఇలా వీడియో ద్వారా వెల్లడించారా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
పవిత్ర బంధం అంటూ ట్విట్టర్ లో పెళ్లి వీడియో పోస్ట్ చేసిన @ItsActorNaresh
రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్న నరేష్.
ఈ వీడియో ఇంకా పేరు ఖరారు చేయని ఒక సినిమా కి సంబంధించింది.
సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ఎమ్ ఎస్ రాజు https://t.co/SN8qYlpSEk— HEMA NIDADHANA (@Hema_Journo) March 10, 2023