మరింత క్షీణించిన తారకరత్న ఆరోగ్య పరిస్థితి. ఒక్కొక్కరిగా బెంగుళూరు చేరుకుంటున్న టీడీపీ ముఖ్యనేతలు. ఇప్పటికే.. కొల్లు రవీంద్ర, గంటా శ్రేనివాస్ రావు అక్కడకి చేరుకున్నారు. మరికొందరు ముఖ్యనేతలు సైతం అక్కడకి చేరుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు సమాచారం అందుతోంది. విదేశీ వైద్యులు తారకరత్నను కోమాలో నుంచి బయటకి శతవిధాలుగా ప్రయత్నించినప్పటికీ అతని ఆరోగ్యం మెరుగుపడలేదని సమాచారం. అందులోనూ.. గత రెండు రోజులుగా తారకరత్న శరీరం వైద్యానికి సహకరించడం లేదని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఆ దృశ్యాలు తెలుగు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి.
తారకరత్న అనారోగ్యం పాలైనప్పటి నుంచి అతని వెన్నంటే ఉన్న ఒకే ఒక్క వ్యక్తి.. బాలకృష్ణ. ఎల్లప్పుడూ పైకి గంభీరంగా కనిపించే బాలయ్య, తారకరత్న విషయంలో ఎప్పుడూ చూసిన దుఃఖంతోనే కనిపించేవారు. ఇవాళ నారాయణ హృదయాలయ ఆస్పత్రి దృశ్యాలు కూడా అలానే కనిపిస్తున్నాయి. చాలా దిగాలుగా కనిపిస్తున్నారు.. బాలయ్య బాబు. ఆయన అందరితో మాట కలుపుతున్నా.. కళ్ల వెంట కన్నీరే కనిపిస్తోంది. తారకరత్న త్వరగా కోలుకోవాలని, మునుపటిలా కలియ తిరగాలని మనమూ కోరుకుందాం..
బెంగుళూరు లోని నారాయణ హృదయలయ హాస్పిటల్ చేరుకున్న నందమూరి బాలకృష్ణ#TarakaratnaHealthUpdate #TarakaRatna #TarakRatna#Getwellsoontarakratna#NandamuriBalakrishna pic.twitter.com/olbOKGZmyM
— 𝚃𝙴𝙰𝙼_𝙲𝙱𝙽 #𝒀𝒖𝒗𝒂𝑮𝒂𝒍𝒂𝒎 ✌️ (@TEAM_CBN1) February 18, 2023
మరోవైపు తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న వార్త తెలిసిన వెంటనే టీడీపీ ముఖ్యనేతలు ఒక్కొక్కరిగా బెంగుళూరు చేరుకుంటున్నారు. ఇప్పటికే.. కొల్లు రవీంద్ర, గంటా శ్రేనివాస్ రావు అక్కడకి చేరుకున్నారు. మరికొందరు ముఖ్యనేతలు సైతం అక్కడకి చేరుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. అయితే.. అందుతోన్న సమాచారం ప్రకారం.. ఇవాళ రాత్రికి తారకరత్నను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉందని నందమూరి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు కొందరు చెబుతున్నారు. ఈ వార్తలు నందమూరి అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న గారిని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లును అడిగి తెలుసుకుని ఆ సమయంలో అక్కడకి చేరుకున్న నందమూరి బాలకృష్ణ గారితో కాసేపు చర్చించడం జరిగింది.#NandamuriTarakaratna #TarakaRatna pic.twitter.com/emZHdk2ODG
— Kollu Ravindra (@KolluROfficial) February 18, 2023
తారకరత్న ఆరోగ్యంపై గంటా స్పందన
తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడారు.#TarakaRatna #GantaSrinivasaRao #TeluguNews #Eenadu pic.twitter.com/BbDIPMponO— Eenadu (@eenadulivenews) February 18, 2023