నమ్రతా శిరోద్కర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మిస్ ఇండియా కిరీటం గెలుచుకుని.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించారు. ఆ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని వివాహం చేసుకుని.. సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు నమ్రత. ప్రస్తుతం భర్త, పిల్లలే లోకంగా బతుకున్నారు. భార్యగా, తల్లిగా బాధ్యతల నిర్వహణలో మునిగిపోయారు. అంతేకాక మహేష్ బాబుకు సంబంధించిన వ్యాపార, సామాజిక వ్యవహరాలన్నింటిని నమ్రతే చూసుకుంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు నమ్రత. మహేష్ బాబు, గౌతమ్, సితారలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తారు.
ఈ క్రమంలో తాజాగా నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిలో తండ్రిని తలచుకుని నమ్రత ఎమోషన్ అయ్యారు. 16 ఏళ్లుగా తండ్రిని మిస్ అవుతూనే ఉన్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు నమ్రత. ఈ క్రమంలో నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రి నితిన్ శిరోద్కర్ ఫోటోను షేర్ చేశారు. దాంతో పాటు.. ‘‘16 ఏళ్లుగా నిన్ను మిస్ అవుతూనే ఉన్నాను పప్పా. మా జీవితాల్లో ఏ మార్పు లేదు.. నీ ప్రతి జ్ఞాపకం నా మదిలో ఎప్పటికి అలానే సజీవంగా నిలిచి ఉంటుంది. మీరు చాలా త్వరగా మమ్మల్ని విడిచి వెళ్లారు. మేం ప్రతి రోజు అంతులేని ప్రేమ, కాంతిని మీకు పంపుతున్నాం’’ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు నమ్రత.
ఈ పోస్ట్ చూసిన నెటిజనులు.. నమ్రతకు ధైర్యం చెబుతున్నారు. పిల్లలకు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు తండ్రే హీరో. నాన్న లేని లోటును ఎవరు తీర్చలేరు. అది ఎంత పెద్ద సెల్రిటీ అయినా సరే. తండ్రి పంచే ప్రేమ, తండ్రి దగ్గర దొరికే రక్షణ మరెక్కడా లభించదు. ఈ విషయంలో నమ్రత కూడా అంతే. అందుకే తండ్రిని తలచుకుని ఇంత ఎమోషనల్ అయ్యారు. ఆమె పోస్ట్ చూసిన జనాలు.. నమ్రత మదిలో ఇంత బాధ ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నమ్రత పోస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.