సినిమా ఫీల్డ్ లో జయాపజయాలు సహజం. అయితే విజయవంతమైన ప్రతి సినిమా ట్రెండ్ సెట్టర్, పాత్ బ్రేకర్ కాలేవు. అతి తక్కువ సందర్భాల్లో.. అది కూడా అతి కొద్ది మంది హీరోలకు మాత్రమే పాత్ బ్రేకింగ్ హిట్స్ లభిస్తాయి. చిరంజీవికి.. ఖైదీ, బాలకృష్ణకు.. ముద్దుల మామయ్య, రాజశేఖర్ కు.. అంకుశం, నాగార్జునకు.. శివ,వెంకటేష్ కు.. చంటి, రవితేజకు.. ఇడియట్, అల్లు అర్జున్ కు.. ఆర్య, విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి లాగా ఒక్కో హీరోకు ఒక్కో పాత్ బ్రేకింగ్ హిట్ ఉంటుంది. అయితే అలాంటి అబ్ నార్మల్ హిట్ తరువాత కొన్ని ప్లాపులు, ఆపై కొన్ని యావరేజ్ చిత్రాలతో సాగిపోతుంటది కెరీర్.
తొలిసారి.. తొలి పాత్ బ్రేకింగ్ హిట్ పడిన డేట్ కే మరో పాత్ బ్రేకింగ్ హిట్టుకు డేట్ ఫిక్స్ అవ్వటం చాలా అరుదుగా జరిగే విషయం. అలా తమ కెరీరును మలుపు తిప్పిన తారీఖునాడే మరో హై ఎక్స్పెక్టెడ్ మూవీలతో వస్తున్నారు రెండు జనరేషన్లకు చెందిన ఇద్దరు వేరు వేరు స్టార్స్. వారిలో ఒకరు కింగ్ నాగార్జున కాగా, మరొకరు ట్రెండీ స్టార్ విజయ్ దేవరకొండ.
ముందుగా నాగార్జున విషయానికి వస్తే ఆయన కెరీర్ లోనే పాత్ బ్రేకింగ్ హిట్టుగా సంచలనాత్మక విజయాన్ని సాధించిన “శివ “1989 అక్టోబర్ 5న విడుదలైంది. కాగా, ప్రస్తుతం కొన్ని వరుస పరాజయాల నేపథ్యంలో తనకు ఒక సూపర్ హిట్ అత్యవసరమైన సందర్భంలో మరలా శివ హిట్ డేట్ ను రిపీట్ చేస్తూ అక్టోబర్ 5 2022న విడుదల కానుంది ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందుతున్న “ద గోస్ట్” చిత్రం.
ఇక.. విజయ్ దేవరకొండ విషయానికి వస్తే ఐదేళ్ల క్రితం 2017 ఆగస్టు 25న రిలీజ్ అయింది అతని కెరీర్ నే కాకుండా ఇండస్ట్రీ పోకడలను సైతం ప్రభావితం చేసిన “అర్జున్ రెడ్డి”. కాగా ఇప్పుడు అదే డేట్ కు ఆగస్టు 25 2022న విడుదలకు సిద్ధమైంది పాన్ ఇండియా లెవెల్ అంచనాల సునామీని సృష్టిస్తున్న పూరీ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ “లైగర్”. ఇలా తమ తమ కెరీర్ టర్నర్స్ డేట్ కే మరలా తాజా చిత్రాలతో రావడం చాలా అరుదైన విశేషం. చూద్దాం .. నాగార్జున, విజయ దేవరకొండలకు ఈ “డేట్ రిపీట్ సెంటిమెంట్” ఎంతవరకు కలిసొస్తుందో.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కథ డిమాండ్ చేస్తే బోల్డ్ సన్నివేశాలు చేస్తాను.. నటి తేజస్వి కామెంట్స్ వైరల్!
ఇదీ చదవండి: OTT Releases: ఈ వారం ఓటిటిలోకి రాబోతున్న 18 సినిమాలు!