ప్రముఖ నటుడు మోహన్ లాల్ మరోసారి తన మంచి మనసులు చాటుకున్నాడు. 20 మంది విద్యార్థులను 15 ఏళ్లపాటు తన సొంత ఖర్చులతో చదివిస్తానని మాటిచ్చాడు. వారికి నచ్చిన కోర్సులను తానే చదివిస్తానని.. అందుకు అయ్యే ఖర్చును భరిస్తానని వెల్లడించాడు. విశ్వశాంతి ఫౌండేషన్ కు చెందిన వింటేజ్ అనే సర్వీస్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్
ఈ విషయంపై స్వయంగా మోహన్ లాల్ వీడియో ద్వారా వెల్లడించారు. మొదటి విడతలో భాగంగా ఈ ఏడాది 20 మందిని ఎంపికన చేసినట్లు తెలిపారు. ‘విశ్వశాంతి ఫౌండేషన్ చొరవతో విటేజ్ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. మేము విద్యార్థులను ఎంపిక చేసేందుకు స్పెషల్ క్యాంప్స్ నిర్వహించాం. ఆ క్యాంప్స్ లో అట్టప్పాడికి చెందిన గిరిజన గ్రామాల్లో 20 మంది ఆరో తరగతి విద్యార్థులను ఎంపిక చేశాం. వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేందుకు వారికి కావాల్సిన వనరులు, విద్య అందిస్తాం. ఈ కార్యక్రమంలో మాకు మద్దతుగా నిలిచిన ఈవై గ్లోబల్ డెలివరీ సర్వీసెస్ కెరీర్స్ కు ధన్యవాదాలు. మా ప్రయత్నంతో పాటు ఈ పిల్లలకు మీ ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఊండాలని కోరుకుంటున్నాం’ అంటూ మోహన్ లాల్ తన ఫేస్ బుక్ పేజ్ లో వీడియో పోస్ట్ చేశారు. మోహన్ లాల్ తీసుకున్న చొరవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.