తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ విద్యాసంస్థల అధినేత, విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు మొదటి నుంచి సాయి బాబా కి ఎంతో భక్తుడు. ఈ నేపథ్యంతోనే ఆయన చంద్రగిరి మండలం రంగంపేటలో సాయి బాబా ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ క్రమంలోనే సాయిబాబా ఆలయ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పూర్తిచేశారు. వివరాల్లోకి వెళితే..
షిరిడీ సాయి బాబా కి మంచు మోహన్ బాబు పరమ భక్తుడు. ఎప్పటి నుంచో సాయి నాథుడికి ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని ఆయన మనసులో అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రగిరి మండలం రంగంపేటలో సాయి బాబా నిర్మించారు. దీనికి సంబంధించిన విషయాలు మోహన్ బాబు ట్విట్టర్ లో వెల్లడించారు. అయితే తాము నిర్మించిన సాయి బాబా ఆలయం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదని వెల్లడించారు. ఈ ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇక సాయి బాబా ఆలయ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా మొదటిరోజున యాగాన్ని నిర్వహించినట్టు మోహన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చ భక్తులు ఈ ఆలయానికి తప్పకుండా వచ్చి వేళ్లే విధంగా ఏర్పాట్లు చేయాలని.. అలా లేకపోతే నిర్మించవద్దని తన పెద్ద విష్ణు తన వద్ద మాట తీసుకున్నాడని మోహన్ బాబు వెల్లడించారు. ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించడం తన పూర్వజన్మ సుకృతం అని.. ఎంతో సంతోషంగా ఉందని మోహన్ బాబు అన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
♦దక్షిణ భారతదేశంలో అతిపెద్దదైన సాయిబాబా ఆలయాన్ని నిర్మించడం సంతోషంగా ఉందని ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు తెలిపారు.
♦ఈరోజు ఆయన తిరుపతిలోని విద్యా నికేతన్ సంస్థల ఆవరణలో సాయిబాబా ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. pic.twitter.com/MdD2OLLkcL— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) August 9, 2022