సెలబ్రిటీలకు సంబంధించి.. మరీ ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని అభిమానులు మాత్రమే కాక.. సామాన్యులు కూడా కోరుకుంటారు. ఇక ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు చాలా కామన్. ఇక పెళ్లైన వ్యక్తిపై మోజు పడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. పలువురు స్టార్ హీరోయిన్లు.. అల్రెడీ పెళ్లై, విడాకులు తీసుకున్న వ్యక్తితో ప్రేమలో పడటమే కాక.. వివాహం కూడా చేసుకుని.. ప్రస్తుతం సంతోషంగా జీవిస్తున్నారు. ఇక తాజాగా ఇలా పెళ్లైన వ్యక్తిని ప్రేమించిన సెలబ్రిటీల జాబితాలో చేరింది.. మాజీ ప్రపంచ సుందరి, హీరోయిన్ మానుషి చిల్లర్. ఈ పొడుగుకాళ్ల సుందరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. తరచుగా ఫోటో షూట్‌లు చేసి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి.. అభిమానులతో పంచుకుంటుంది.
ఈ క్రమంలో తాజాగా మానుషి చిల్లర్‌కు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ పాతికేళ్ల ఈ మాజీ ప్రపంచ సుందరి పెళ్ళై భార్యకు దూరమైన వ్యక్తితో ప్రేమలో పడిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మానుషి.. నిఖిల్ కామత్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడిందని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. గత ఏడాది కాలంగా.. వీరిద్దరి మధ్య రిలేషన్ నడుస్తోందని అంటున్నారు. ఇక నిఖిల్ కామత్ విషయానికి వస్తే.. ఇతడు బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త అని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హిందూస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఇద్దరి మధ్య ఈ బంధం మొదలై దాదాపు ఒక సంవత్సరం అవుతోందని, అయితే ఇటీవల కాలంలో వీరిద్దరూ కలిసి.. రిషికేశ్ చేరుకున్నారని, అక్కడ కూడా తమ డేటింగ్ వ్యవహారాన్ని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం.
ఇక వీరిద్దరూ కలిసి ఇలా టూర్లకు వెళ్లడం ఇదే మొదటి సారి కాదని, గతంలో కూడా చాలా సార్లు వీరు కలిసి ట్రిప్పులకు వెళ్లారని కూడా చెబుతున్నారు. తాజాగా వీరిద్దరూ దైవ దర్శనం చేసుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక కామత్‌కు ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని అంటున్నారు. జెరోధా సహవ్యవస్థాపకుడు అయిన కామత్ 2019 సంవత్సరంలో ఇటలీలో అమండా అనే మహిళను గ్రాండ్ గా వివాహం చేసుకున్నాడు. కానీ విభేదాల కారణంగా.. వీరిద్దరూ 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మానుషితో ప్రేమలో పడ్డాడని సమాచారం.
తాజాగా మానుషి అక్షయ్ కుమార్‌తో కలిసి ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ చిత్రంలో నటించింది. ఈ సినిమాలో ఆమె రాణి సంయోగిత పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ప్రస్తుతం మానుషి కొన్ని ప్రాజెక్ట్‌లు ఓకే చేసే పనిలో ఉందట. అలానే టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.