Dream: కొంతమంది తమ జీవితాన్ని కలలు కనటంతో సరిపెట్టుకుంటారు.. మరికొంతమంది కలలు కనటమే కాదు.. ఆ కలల్ని సాకారం చేసుకోవటానికి కృషి చేస్తుంటారు. ఇంకా కొంతమందిని.. కలలే పైకి తీసుకొస్తుంటాయి.. ఆ కలలే వారి జీవితాన్ని నిర్థేషిస్తుంటాయి.. వారి జీవితాల్లో అద్భుతాలను చేస్తుంటాయి.. ఇది నిజం.. ఓ వ్యక్తి జీవితాన్ని ఓ కల మార్చేసింది. బికారిగా ఉన్న అతడ్ని కోటీశ్వరుడ్ని చేసేసింది. ఇంతకీ సంగతేంటంటే.. అమెరికాలోని వర్జీనియాకు చెందిన ఎలోంజో కోలెమాన్ అనే వ్యక్తికి లాటరీలు కొనటం ఓ అలవాటు. ఎప్పటికైనా లాటరీ గెలిచి కోటీశ్వరుడు కావాలన్నది అతడి ఆశయం.
ఓ రోజు రాత్రి నిద్ర పోతున్నపుడు అతడి కలలోకి కొన్ని నెంబర్లు వచ్చాయి. మరుసటి రోజు ఆ నెంబర్లను ఆధారంగా చేసుకుని మొత్తం నాలుగు లాటరీలు తీసుకున్నాడు. నాలుగు లాటరీలకు సంబంధించిన నెంబర్లను కలలో వచ్చిన నెంబర్లతో మ్యాచ్ అయ్యేలాగా ఎంచుకున్నాడు. అదృష్టమో.. కష్టానికి లభించిన ఫలితమో తెలీదు కానీ, కలలో కనిపించిన నెంబర్లకు ఓ లాటరీ తగిలింది. ఏకంగా 1.9 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. తన కలలో వచ్చిన నెంబర్లతో లాటరీ గెలవటంతో ఎలోంజో సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.
దీనిపై ఎలోంజో మాట్లాడుతూ.. ‘‘ దీన్ని నమ్మలేకుండా ఉన్నాను.. అది ఎలా జరిగిందో ఇప్పటికీ అర్థం కావటం లేదు. కలలో వచ్చిన నెంబర్లతో లాటరీ గెలవటం ఏంటి?’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదృష్టం అంటే ఎలోంజోదేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కలలు కూడా మనిషిని కోటీశ్వరుడ్ని చేయటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. మరి, ఎలోంజోను కోటీశ్వరుడ్ని చేసిన కలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Video: గోల్డ్ చైన్ ఎత్తుకెళ్తున్న చీమలు..! వీడియో వైరల్