దర్శకుడు.. ఒక సినిమాను చిత్రీకరించాలంటే దర్శకుడిదే మెయిన్ రోల్. కథ దగ్గర మొదలు పెడితే సినిమా పూర్తయ్యేవరకు ప్రతి సీన్ లో కనిపించేది దర్శకుడే. మనకు తెలిసిందే ఇదే. కానీ, మనం చెప్పబోయే మలయాళ దర్శకుడు ‘సనల్ కుమార్ శశిధరన్’ దీనికి పూర్తిగా విభిన్నం. ఒక నటిని వేధించినందుకు జైలు పాలయ్యాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ టాలీవుడ్ ప్రేక్షకులకూ పరిచయమే. ఆమె నటించిన లూసీఫర్, ఓడియన్, మరక్కార్, ద ప్రీప్ట్, చతుర్ముఖం, అసురన్ వంటి డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నాయి. కేవలం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా, ప్లే బ్యాక్ సింగర్ గా మలయాళీ ప్రేక్షకుల్లో బాగా పాపులారిటీ సంపాదించారామె. కాగా మంజు 2020లో ‘కయాణం’ అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్.
ఇది కూడా చదవండి: Jayamma Panchayathi: సుమ కొంపముంచిన విశ్వక్- దేవి వివాదం!
కయాణం సినిమా షూటింగ్ సమయంలోనే మంజు వారియర్ కు అదే పనిగా మెసేజ్ లు పంపిస్తూ వేదింపులకు గురిచేసేవాడట సనల్ కుమార్. సినిమా షూటింగ్ పూర్తయ్యాక కూడా ఈ తంతు కొనసాగించాడు. దీంతో అతనికి ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చిందామె. అయిన అతను మాత్రం తన వికృత చర్యలు ఆపలేదు. సోషల్ మీడియాలో కూడా సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురిచేశాడు. ఈక్రమంలో అతడి వేధింపులు భరించలేక మంజు వారియర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తిరువనంతపురంలో ఉన్న సనల్ కుమార్ ఇంటికి మఫ్టీలో వెళ్లిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కొచ్చికి తరలించారు. చిత్ర పరిశ్రమలో ఎన్నో అవార్డులు సనల్ కుమార్ ఇలాంటి నీచమైన పనులు చేయడం ఏంటని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
Kerala Police take Director #SanalKumarSasidharan into custody from his residence in Neyyattinkara, Thiruvananthapuram after actress #ManjuWarrier filed a complaint against him for allegedly stalking her.#KeralaPolice pic.twitter.com/ExHAeCcgtt
— MANI (@ManiValsa) May 5, 2022