టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీకి ఎంతగా ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏది ఏమైనా తన ఫ్యామిలీ తర్వాతే సినిమా అంటుంటాడు. ఎల్లప్పుడూ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే మహేష్.. ఖాళీ టైమ్ దొరికిందంటే చాలు తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో గడిపేస్తుంటాడు. వాళ్ళతోనే సరదాగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తాడు. అయితే మహేష్ ఫ్యామిలీతో కలిసి దిగిన ఓ స్పెషల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫిబ్రవరి 10 అంటే.. మహేష్ – నమ్రతలకు స్పెషల్ డే. 2005 ఫిబ్రవరి 10న ఈ ఎవర్ గ్రీన్ కపుల్ మ్యారేజ్ జరిగింది. నేటితో 17 సంవత్సరాలు పూర్తవడంతో మహేష్ తన ట్విట్టర్ వేదికగా పర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్ షేర్ చేశాడు. ’17 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఇలాంటి యానివర్సరీలు మరెన్నో మనం జరుపుకోవాలి.. శుభాకాంక్షలు!’ అంటూ మహేష్ తన భార్య నమ్రతను విష్ చేశాడు. ప్రస్తుతం మహేష్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
So easily 17! Happy anniversary NSG!! Many more to us… it’s all about love ♥️♥️♥️ pic.twitter.com/Lw76cY77zu
— Mahesh Babu (@urstrulyMahesh) February 10, 2022
ఇక మహేష్ పోస్ట్ కి అభిమానులు సోషల్ మీడియాలో భారీ ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సాధారణంగా నమ్రత తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. మహేష్ కూడా అప్పుడప్పుడు ఫ్యామిలీతో సరదాగా గడిపిన వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంటాడు. తాజాగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లిన పిక్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్నాడు. మారి మహేష్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.