యూట్యూబ్ షేక్ చేసే సాంగ్‌తో మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన మన ఫోక్ డ్యాన్స్ జోడి మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయిల రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే ! పాటల్లో వీళ్ళు వేసిన ఊరమాస్ స్టెప్పులు ఒకెత్తయితే, ఈ మధ్య రియల్ లైఫ్‌లో వీళ్ళు నడిపిన హై వోల్టేజ్ డ్రామా ఇంకో ఎత్తు! షూటింగ్ అనుకుంటే పొరపాటే.. మనోళ్ళు హైదరాబాద్‌లోని ఒక గదిలో పర్సనల్ ‘రిహార్సల్స్’ లో మునిగిపోతే, కరెక్ట్ టైమ్‌కి ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఎంట్రీ ఇచ్చి ‘రెడ్ హ్యాండెడ్’గా లేపేసింది! ‘నా మొగుడు అమాయకుడు.. ఈ పిల్లే నా కాపురం కూల్చింది’ అంటూ అక్కడ శరణ్య చేసిన లైవ్ యాక్షన్ పర్ఫార్మెన్స్ ముందు థియేటర్ ఆర్టిస్టులు కూడా వేస్ట్! మరి మన మాధురి రాథోడ్ ఊరుకుంటుందా? ‘పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను నట్టేట ముంచాడు’ అంటూ ఈశ్వర్ సాయిపై చీటింగ్ కేసు పడేసింది. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, నార్సింగి పోలీస్ స్టేషన్ చుట్టూ కథ అంతా నడిచేసరికి.. జనాలు ఏమనుకున్నారంటే, ‘బాబోయ్.. వీళ్ళ కెరీర్‌కి ఇక పర్మనెంట్‌గా ఎండ్ కార్డ్ పడిపోయింది’ అని ఫిక్స్ అయిపోయారు
కథలో అసలైన తిరకాసు ఇక్కడే బయటపడింది! కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు ఈశ్వర్ సాయిని జైల్లో పెట్టట్లేదని, తన పరువు బజార్న పడిందని మాధురి రాథోడ్ తెగ ఫీలైపోయింది. అంతే.. ఫ్యాన్‌కు తాడు కట్టి ఆత్మహత్యకు ట్రై చేసింది! లక్కీగా ఇంట్లోవాళ్లు టైమ్‌కి తలుపులు పగలగొట్టి కాపాడడంతో సరిపోయింది కానీ, లేదంటే కథ ఇంకోలా ఉండేది. ‘నా మరణమే దీనికి ముగింపు’ అని లెటర్ రాసి హాస్పిటల్ బెడ్ ఎక్కిన మాధురిని చూసి, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంతా తెగ కన్నీళ్లు పెట్టేసుకున్నారు!”
“ఇక మన హీరో ఈశ్వర్ సాయి మాత్రం సైలెంట్‌గా ఉంటాడా? ‘అయ్యో నా తప్పేమీ లేదు మొర్రో’ అంటూ అరెస్ట్ కాకుండా ఉండటానికి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా బ్యాచులు బ్యాచులుగా విడిపోయి.. ‘అసలు తప్పు ఎవరిది? మొగుడిదా…? మోడల్‌దా…? లేక ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా లేపిన పెళ్లానిదా….?’ అంటూ యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ చూసి బుర్రలు పాడుచేసుకున్నారు. ఇక వీళ్లిద్దరూ మళ్లీ మొహం చూపించలేరని, వీళ్ల చాప్టర్ పర్మనెంట్‌గా క్లోజ్ అని జనాలు గట్టిగా ఫిక్స్ అయిపోయారు!”
కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది! మన ఫోక్ స్టార్స్ ఇచ్చిన షాకింగ్ ఎంట్రీ చూసి నెటిజన్ల బుర్రలు పాడైపోయాయి. నిన్నటిదాకా లాకప్‌లు, హాస్పిటల్ సెలైన్ బాటిళ్ల చుట్టూ హంగామా చేసిన ఈశ్వర్ సాయి.. హఠాత్తుగా మైకులు, మీడియా ముందు ల్యాండ్ అయిపోయి గ్రాండ్ ప్రెస్ మీట్ పెట్టాడు! ‘నా పని అయిపోలేదు.. కెరీర్‌లో మళ్ళీ బిజీ అవుతున్నా, సరికొత్త సాంగ్‌తో మీ ముందుకు వస్తున్నా’ అంటూ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చి అందరికీ గట్టి షాకే ఇచ్చాడు!”
ఇక మన డ్యాన్సింగ్ క్వీన్ మాధురి రాథోడ్ అయితే ఒక అడుగు ముందుకేసి.. ‘బిందెలు బిందెలు బావయ్యో’ అంటూ ఊరమాస్ ఎనర్జీతో సరికొత్త ఫోక్ సాంగ్ ప్రోమో వదిలి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది! అప్పుడే యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండింగ్ లిస్ట్‌ను దంచేస్తోంది. దీన్నిబట్టి వీళ్లిద్దరి లాజిక్ ఏంటో అర్థమైందా? ‘లైఫ్‌లో ఎంత పెద్ద రచ్చ జరిగినా, ఎంతమంది కామెంట్లు పెట్టినా.. మన డ్యాన్స్, మనకు వచ్చే వ్యూస్ మాత్రం అస్సలు ఆగకూడదు!’ అంతే కదా మరి!”
నిజం చెప్పాలంటే.. సామాన్యులకి ఇదొక పెద్ద షాకింగ్ క్లాస్ అనే చెప్పాలి ! కొట్టుకోవడం, తిట్టుకోవడం, స్టేషన్ల చుట్టూ తిరగడం, సూసైడ్ డ్రామాలు ఆడటం.. ఇదంతా జస్ట్ ‘వ్యూస్ అండ్ పబ్లిసిటీ’ కోసమేనా అనే రేంజ్‌లో లైట్ తీసేసుకుని, కొత్త పాటలతో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు వీళ్ళ… రియల్ లైఫ్ సీన్ల ముందు ఏ సీరియల్ ట్విస్టులు కూడా సరిపోవు. మరి ఈ ‘బిందెలు బావయ్య’ ట్రెండింగ్ సాంగ్‌తో మాధురి రాథోడ్, అటు ఈశ్వర్ సాయి నెట్టింట ఎలాంటి రచ్చ లేపుతారో చూడాలి మరి!”
