ప్రస్తుతం సెలబ్రిటీలు అందరూ సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్నారు. జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఇక్కడిదాకా వచ్చిన వారు.. ఇక నెమ్మదిగా తమ కలలు ఒక్కొటి సాకారం చేసుకునే పనిలో ఉన్నారు. చాలా మంది సొంతి ఇంటి నిర్మాణం చేపట్టడం, ఇష్టమైన వాహనాలు కొనుగోలు చేయడం వంటివి చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా చేరారు. ఖరీదైన కారు కొన్నారు రామజోగయ్య శాస్త్రి. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు.
రామజోగయ్య శాస్త్రి హైఎండ్ MG(మోరిస్ గారజస్) హెక్టార్ కారు కొనుగోలు చేశారు. దీని ఖరీదు సుమారు 25 లక్షల రూపాయల వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు రామజోగయ్య శాస్త్రి. కారు కొంటున్న వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఆయనకు కంగ్రాట్స్ చేబుతున్నారు. ఇలానే ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి తాజాగా భీమ్లా నాయక్ సినిమాకు పాటలు రాశారు. అవి ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
My new car💕 Thq @MGMotorIn 💕 pic.twitter.com/UGrE4SnSal
— RamajogaiahSastry (@ramjowrites) March 31, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.