నూతన సంవత్సరంలో కూడా ఇండస్ట్రీని విషాదాలు వదలడం లేదు. కొత్త ఏడాది ప్రారంభంలోనే సినీ ప్రముఖలు, వారి కుటుంబ సభ్యులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా గీత రచయింత చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మామ.. అంటే చంద్రబోస్ భార్య సుచిత్ర చంద్రబోస్ తండ్రి మృతి చెందారు. సుచిత్ర చంద్రబోస్ తండ్రి చాంద్ బాషా (92) గురువారం రాత్రి హైదరాబాద్ మణికొండలో తుది శ్వాస విడిచారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.
ఇక చాంద్ బాషా.. అనేక దక్షిణాది సినిమాలకు సంగీత దర్శకునిగా పనిచేసారు. చాంద్ బాషాకి ముగ్గురు అమ్మాయిలు, ఒక కొడుకు సంతానం ఉన్నారు. ఇక చాంద్ బాషా.. తెలుగులో ఖడ్గ తిక్కన్న, బంగారు సంకెళ్లు, స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడు వంటి చిత్రాలకు.. కన్నడంలో అమర భారతి , చేడిన కిడి కన్నడ వంటి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. చాంద్ బాషా మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇక సుచిత్ర టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకోగా.. చంద్రబోస్ మంచి రచయితగా గుర్తింపు పొందారు. చంద్రబోస్ కలం నుంచి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. ప్రస్తుతం ఆయన వాల్తేరు వీరయ్య సినిమాకు గీతాలు అందించారు.