సాధారణంగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలకి యూత్ లో క్రేజ్ ఎక్కువ. మాస్ క్లాస్ ఎమోషన్స్ మిక్స్ చేసే డైరెక్టర్ – ప్రస్తుత యూత్ ఫేవరేట్ విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకి క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా యాక్షన్ మూవీ లైగర్. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కాబోతుంది. ఆల్రెడీ లైగర్ ఫస్ట్ లుక్, పోస్టర్ లతో సినిమా పై అంచనాలు పెంచేశారు మేకర్స్.
Not sure how many actors can expose their body without vfx, raw 🤙
Real #Liger pic.twitter.com/dZSRLQHxWm
— Freddie Mercury-ARR ᴸᶦᵍᵉʳ (@FreddieVijayDev) December 15, 2021
ఈ సినిమాలో విజయ్ హెయిర్ స్టైల్, ఆటిట్యూడ్ అన్నికూడా డిఫరెంట్ గా ఉండబోతున్నాయట. అయితే.. విజయ్ వర్కౌట్స్ చేస్తూ పోజిచ్చిన లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిక్స్ ప్యాక్ బాడీతో విజయ్ లేడీ ఫాన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా మేకర్స్ లైగర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసారు. లైగర్ ఫస్ట్ గ్లింప్స్ ఈ నెల 31న రాబోతుండగా.. 2022 ఆగష్టు 25న సినిమా రిలీజ్ కాబోతుందని మేకర్స్ తేల్చేసారు.ఈ సినిమాను కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే లైగర్ మూవీతో సౌత్ ఇండస్ట్రీలో డెబ్యూ చేయనుంది.
VIJAY DEVERAKONDA: ‘LIGER’ ON 25 AUG 2022… #Liger – starring #VijayDeverakonda and #AnanyaPanday with #MikeTyson – locks the release date: 25 Aug 2022 in *cinemas*… A glimpse will be unveiled on 31 Dec 2021… Only a small schedule is pending, which will be done in #India. pic.twitter.com/zUaC0gRyT0
— taran adarsh (@taran_adarsh) December 16, 2021