ప్రసుత్తం రీరిలిజ్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో క్లాసిక్ హిట్‌లుగా నిలిచిన సినిమాలను మరోసారి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఖుషి, జల్సా, ఒక్కడు, మురారి, ఆది, త్రీ వంటి సినిమాలు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి.. అలరించిన సంగతి తెలిసిందే. మరి కొన్ని సినిమాలు ఇలా రీరిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఓ నెటిజన్.. డైరెక్టర్ కృష్ణవంశీని ఉద్దేశిస్తూ.. ట్విట్టర్‌లో.. చేసిన రిక్వెస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తెలుగు దర్శకుల్లో కృష్ణవంశీది ప్రత్యేక శైలి. ఒకే జానర్‌కు పరిమితం కాకుండా.. వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన ఘనత కృష్ణవంశీది. నిన్నే పెళ్లాడుత వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. మురారీ వంటి సినిమా, ప్రభాస్‌తో తీసిన చిత్రం సినిమాలు ఇలా భిన్నమైనవే. ప్రస్తుతం ఆయన రంగమార్తండి సినిమా తీశాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రీరిలిజ్ ట్రెండ్ నేపథ్యంలో.. ఓ నెటిజన్.. ట్విట్టర్ వేదికగా కృష్ణవంశీకి ఓ రిక్వెస్ట్ చేశాడు. ‘కృష్ణవంశీ గారు ఒక్కసారి.. మీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం సినిమా రీరిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆ సినిమాను మరోసారి థియేటర్స్‌లో రిలీజ్ చేస్తే.. 4షోలు చూడటానికి నా లాంటి చాలా మంది సిద్ధంగా ఉన్నారు సార్…. దయచేసి ఈ అభ్యర్థనను మన్నించండి. నా జీవితంలో నేను చూసిన గొప్ప సినిమా సింధూరం. నేను మృతి చెందేలోపు మరోసారి.. ఆసినిమాను థియేటర్‌లో చూడాలి.. ఆ సంగీతాన్ని వినాలి’’ అంటూ ట్విట్టర్‌లో కృష్ణవంశీని ట్యాగ్ చేస్తూ.. సదరు యూజర్ ట్వీట్ చేశాడు. ఇందుకు కృష్ణవంశీ ఇచ్చిన రిప్లై.. ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
నెటిజన్ ట్వీట్‌కు కృష్ణవంశీ బదులిస్తూ.. “అమ్మో.. ఆ సినిమా కారణంగా.. 5 ఏళ్ళు అప్పులు కట్టాను అయ్యా.. వామ్మో’ అంటూ దణ్ణం పెట్టేశాడు. సింధూరం సినిమా అప్పుల భారాన్ని తన పై వేసుకున్నట్టు కృష్ణవంశీ తెలిపాడు. ఆయన చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఇక నాగార్జునతో నిన్నే పెళ్లాడతా సినిమా తర్వాత.. కృష్ణవంశీ.. ‘ఆంధ్రా టాకీస్’ అనే పతాకంపై తొలి ప్రయత్నంగా ‘సింధూరం’ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు. పోలీస్ వర్సెస్ నక్సలిజమ్ అంశంపై తనదైన స్టైల్లో.. సింధూరం సినిమాను తెరకెక్కించాడు కృష్ణవంశీ. ఈ సినిమాలో బ్రహ్మాజీ హీరోగా నటించగా, సెకండ్ హీరో పాత్రలో రవితేజ కనిపించారు. ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. కాకపోతే జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలచింది. ఈ చిత్రానికి ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డు కూడా లభించింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు దక్కించుకంది కానీ.. కలెక్షన్ల విషయంలో దారుణంగా విఫలమయ్యింది. అందుకే కృష్ణవంశీ ఇలా దండం పెట్టేశాడు.
కృష్ణవంశీ గారు ఒక్కసారి సింధూరం సినిమా రిలీజైతే నా లాంటి చాలామంది4 షోస్ చూడటానికి సిద్ధంగా ఉన్నాము సార్…. దయచేసి ఈ మా ఆశ నెరవేర్చాలని కోరుతున్నాము సార్..”నా జీవితంలో నేను చూసిన గొప్ప సినిమా సిందూరం”..మరణం లోపు మరల మరల చూడాలనిపించిన చిత్రం, వినాలి అనిపించే సంగీతం.@director_kv pic.twitter.com/dQPntTh47E
— Chandu Gummalla (@gummallachandu) January 3, 2023