ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డులను క్రియేట్ చేస్తోంది KGF Chapter-2. మొదటిరోజు నుండి ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కంటిన్యూ చేస్తోంది. రాకింగ్ స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం థియేటర్ల ఉన్నా.. కేజీఎఫ్-2 దండయాత్ర మాత్రం తగ్గడం లేదు. భారీ విజయం సొంతం చేసుకున్న ఈ సినిమాపై చాలామంది సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ అఖండమైన విజయాన్ని అందించిన అభిమానులకు KGF టీమ్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ క్రమంలో తాజాగా రాకీ భాయ్ యష్.. అభిమానులకు కేజీఎఫ్ చిత్ర బృందానికి థ్యాంక్స్ తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
” ఓ గ్రామంలో కరువు పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామస్తులు అందరూ సమావేశం కావాలనుకున్నారు. ఆ సమావేశానికి ఓ పిల్లవాడు గొడుకుతో వచ్చి ఇసుకలో నిల్చున్నాడు. కొందరు ఆ బాలుడిని చూసి మూర్ఖుడు అన్నారు. మరికొందరు అతి విశ్వాసం అన్నారు. మీకు తెలుసు దానేని ఏమంటారో.. అది నమ్మకం. నేను కూడా ఆ బాలుడి లాంటి వాడినే. అలా నమ్మకంగా ముందుకు వచ్చాను. నా మీద ప్రేమాభిమానాలు చూపించిన మీ అందరికి నేను థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా చిన్నమాట. అలాగే నాతో పాటు కలిసి కష్టపడిన KGF టీమ్ కి థ్యాంక్స్. మేము ఈ చిత్రం ద్వారా మంచి అనుభూతిని అందించామని భావిస్తున్నాను”అని యష్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యష్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.