ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డులను క్రియేట్ చేస్తోంది KGF Chapter 2. మొదటిరోజు నుండి ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కంటిన్యూ చేస్తోంది. రాకింగ్ స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 165 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ సినిమా.. సెకండ్ డే కూడా ఏమాత్రం తగ్గలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కేజీఎఫ్-2 రిలీజ్ ముందునుండే ప్రేక్షకులలో అంచనాలు పీక్స్ లో నెలకొన్నాయి. ఈ క్రమంలో హిందీలో డబ్బింగ్ సినిమాగా విడుదలైన కేజీఎఫ్-2.. బాలీవుడ్ స్ట్రయిట్ ఫిలిమ్స్ రికార్డులను బీట్ చేసేసింది. ఫస్ట్ డే 53.95 కోట్ల గ్రాస్ రాబట్టగా.. సెకండ్ డే 46.79 కోట్ల గ్రాస్ సాధించడం విశేషం. దీంతో రెండోరోజుకే కేజీఎఫ్ హిందీ వెర్షన్ 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరింది.
ఇక కేజీఎఫ్-2 రెండు రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసిందంటే..
డే 1- 165.37 కోట్లు
డే 2 – 139.25 కోట్లు
మొత్తం(2డేస్ కలిపి) – 304.62 కోట్లు (గ్రాస్)
#KGFChapter2 WW Box Office
ENTERS the PRESTIGIOUS ₹300 cr club in just 2 days.
Day 1 – ₹ 165.37 cr
Day 2 – ₹ 139.25 cr
Total – ₹ 304.62 crEXCELLENT HOLD.
In many circuits Day 2 fetched more than Day 1.#Yash #KGF2
— Manobala Vijayabalan (@ManobalaV) April 16, 2022
కేవలం ఇండియాలోనే రెండు రోజులకు 240 కోట్ల గ్రాస్ రాబట్టింది.
Thu kya main kya Hatja Hatja 🔥
𝐓𝐨𝐨𝐟𝐚𝐧 𝐓𝐨𝐨𝐟𝐚𝐧 ⚡#KGFChapter2 @Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC @DreamWarriorpic @PrithvirajProd #KGF2BoxOfficeMonster pic.twitter.com/QHYZBLlpmD— Hombale Films (@hombalefilms) April 16, 2022
మరి ఈ సినిమా ముందుముందు ఎలాంటి సంచలనాలు సృష్టించనుందో చూడాలి. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీనిధిశెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందించగా.. రవి బస్రుర్ సంగీతం అందించారు. మరి కేజీఎఫ్-2 సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.