టాలీవుడ్ సంచలనం బేబీ మూవీ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ఊహించని రీతిలో కలెక్షన్లను వసూల్ చేస్తూ నయా రికార్డులను క్రియేట్ చేస్తోంది. పెద్ద సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళ్తోంది.
కొన్ని సినిమాలు సైలెంట్ గా విడుదలై రికార్డ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయి. ఊహించని రీతిలో హిట్ కొట్టి ఆశ్యర్యపరుస్తుంటాయి. ఇదే రీతిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బేబీ సినిమా కూడా రికార్డులను తిరగరాస్తోంది. విడుదలై రెండు వారాలు కావొస్తున్నా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతూ దూసుకెళ్తోంది. దర్శకుడు సాయిరాజేశ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించి విమర్షకుల నుంచి ప్రశంసలు పొందారు. ఈ నెల 14న విడదలైన బేబీ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీతో యూత్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో మరో రికార్డును బ్రేక్ చేసింది బేబీ సినిమా. ఆ వివరాలు మీకోసం..
బేబీ సినిమా విడుదలైన రోజునుంచే పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్ తో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయింది. రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వసూల్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. నేటి తరం యువతలో ప్రేమ విషయంలో చోటుచేసుకుంటున్న వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు దర్శకుడు చూపించడంతో యూత్ కి ఫుల్ గా కనెక్ట్ అయ్యింది. దీంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే తాజాగా బేబీ మూవీ కేజీఎఫ్2 సినిమా సాధించిన రికార్డును బ్రేక్ చేసి సెన్సేషన్ గా మారింది. వరుసగా రోజుకు రూ. కోటి కలెక్షన్లతో కేజీఎఫ్2 మూవీ సాధించిన రికార్డును బ్రేక్ చేసింది. కేజీఎఫ్2 సినిమా 12 రోజుల పాటు వరుసగా కోటి రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోగా బేబీ మాత్రం 13 రోజుల పాటు కోటి రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. బేబీ సినిమా సక్సెస్ తో ఇందులోని నటీనటులకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి.