కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెందారు. కన్నడ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ గా పేరు పొందిన పునీత్ తన నటనతో కన్నడలో ఎనలేని అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తాజాగా పునీత్ రాజ్ కుమార్ కి హార్ట్ ఎటాక్ కి గురయ్యారు. జీమ్ లో వర్కౌట్ చేస్తున్న ఆయనకు సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో.. కుటుంబ సభ్యులు పునీత్ రాజ్ కుమార్ ని బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ట్రీట్మెంట్ అందిస్తున్న సమయంలో పునీత్ ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఆయన తుది శ్వాస విడిచారు. పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త తెలుసుకున్న అభిమానులు ఆస్పత్రి వద్దకి భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం స్కూల్స్, ధియేట్ర్స్ అన్నీ మూసేయాల్సిందిగా కోరింది. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యలను పరామర్శించారు.
చివరి చూపునకు ఏర్పాట్లు
పునీత్ మరణ వార్తతో బెంగళూరు, బోర్డర్లు సహా మొత్తం రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. స్కూళ్లు, కళాశాలలకు రెండ్రోజులు సెలవులు ప్రకటించారు. థియేటర్లు, హోటళ్లు మొత్తం మూసివేశారు. పునీత్ రాజ్‌కుమార్‌ను చివరిసారి అభిమానులు చూసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బెంగళూరులోని ఓ స్టేడియంలో పునీత్ పార్థీవదేహం ఉంచి అభిమానులు చూసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మైదానాన్ని పోలీసులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికే పరిశీలించారు. హుటాహుటిన ఏర్పాట్లు చేశారు.
Preparation for the last rites and the public viewing for #PuneethRajkumar pic.twitter.com/MGenoR7QZ3
— Bangalore Times (@BangaloreTimes1) October 29, 2021