కరాటే కళ్యాణి.. సినిమాల కన్నా కూడా వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. బిగ్‌బాస్ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది కరాటే కళ్యాణి. ఇండస్ట్రీలో చోటు చేసుకునే వివాదాలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. వార్తల్లో నిలుస్తుంది. ఇక తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది కరాటే కళ్యాణి. యూట్యూబర్‌తో గొడవపెట్టుకుని.. అతడి చేతిలో దెబ్బలు కూడా తిన్నది. అనంతరం యూట్యూబర్‌ని రోడ్డుమీద పరిగెత్తించి.. గుడ్డలూడదీసి మరీ కొట్టింది కరాటే కళ్యాణి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
శ్రీకాంత్ రెడ్డి అనే యూట్యూబర్.. మహిళల్ని అగౌరవ పరుస్తూ పిచ్చి పిచ్చి వీడియోలు తీస్తూ యూట్యూబ్‌లో బాగా పాపులర్ అయ్యాడు. ఆంటీలు, అమ్మాయిలపై ఫ్రాంక్ వీడియోలు తీస్తూ.. వాళ్లతో అసభ్యకరంగా మాట్లాడిస్తూ.. పనికిమాలిన వీడియోలు చేస్తూ.. ఫేమస్ అయ్యాడు. అయితే మరి కరాటే కళ్యాణికి, ఇతడికి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. గురువారం రాత్రి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి అతన్ని నిలదీసింది కరాటే కళ్యాణి. ఫ్రాంక్ వీడియోలు తీస్తుండగా.. శ్రీకాంత్ రెడ్డిని వెంబడించిన కరాటే కళ్యాణి ‘నువ్ తీస్తున్న ఫ్రాంక్ వీడియోలు ఏంటి.. సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావ్..? అంటూ అతన్ని చెంపపై కొట్టింది. దీంతో పక్కనే ఉన్న ఇంకొక వ్యక్తి వచ్చి శ్రీకాంత్ రెడ్డి చొక్కా పెట్టుకుని కొట్టడంతో గొడవ పెద్దదైంది.
ఇది కూడా చదవండి: Karate Kalyani: విశ్వక్ సేన్ vs దేవి నాగవల్లి వివాదం.. అనసూయని లాగిన కరాటే కళ్యాణి!తిరగబడ్డ శ్రీకాంత్ రెడ్డి.. తనని కొట్టిన వ్యక్తితో పాటు చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్న కరాటే కళ్యాణి చెంప పగలకొట్టాడు. ఈ ఘర్షణలో కరాటే కళ్యాణి చంటి బిడ్డతో సహా కిందపడిపోయింది. ఆ తరువాత చుట్టూ ఉన్న వాళ్లు శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసి.. విపరీతంగా కొట్టారు. కింద పడిపోయిన కరాటే కళ్యాణి మళ్లీ లేచి అతన్ని పరుగెట్టించి, గుడ్డలీడదీసి మరీ కొట్టింది. అంతేకాక ల***కొడుకు అంటూఐ ఎస్ఆర్ నగర్ నుంచి మధురానగర్ వరకూ అతన్ని పరుగుపెట్టించి మరీ దాడి చేసింది కరాటే కళ్యాణి.
ఇది కూడా చదవండి: పిల్లల కోసం ఆ పని చేయడానికి ఇప్పుడైనా రెడీ!
అయితే తనపై చేయి చేసుకోవడంతో శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయాడు. నన్ను కొట్టడానికి నీకు ఏం హక్కు ఉంది.. ఎందుకు కొట్టావ్ అని తిరగబడ్డాడు. నీ ఫ్రాంక్ చేస్తే తప్పు అంటున్నావ్.. నువ్ చేసే పనికి మాలిన పనులకంటే నేను చేసే వీడియోలు ఎక్కువ కాదు.. నువ్వేం పత్తిత్తువి కాదు.. నువ్వు వ్యాంప్ పాత్రలు చేయడం లేదా? నీ బాగోతం మొత్తం నాకు తెలుసు? వీడియో తీసుకుంటానంటే రూ.2 లక్షలు డబ్బులు అడిగి ఇప్పుడు ఇవ్వను అనేసరికి ఇలా చేస్తున్నావ్.. నువ్వో పెద్ద *** అంటూ నోటికి పనిచెప్పాడు శ్రీకాంత్ రెడ్డి.
ఇది కూడా చదవండి: శివశక్తి ఫౌండేషన్ పై విరుచుకుపడిన కరాటే కళ్యాణి..! అంతా ఫ్రాడ్ అంటూ..
కాగా.. కరాటే కళ్యాణి.. శ్రీకాంత్ రెడ్డిని కొడుతున్న వీడియోలను తన ఫేస్ బుక్ లైవ్‌లో మొత్తం చూపిస్తూ.. బట్టలూడదీసి కొట్టాం.. వీడిని వదిలేది లేదు.. స్టేషన్‌లో పెట్టి తన్నిస్తా అంటూ ఈ గొడవను చూస్తున్న వాళ్లని సైతం చీల్చిచెండాలింది. మీకు అమ్మా అక్కలు లేర్రా.. చూస్తూ ఉంటారా? ఇకపై శ్రీకాంత్ రెడ్డి అనేవాడు ఉండడు. వాడికి గుండు కొట్టించి.. సున్నం బొట్లు పెట్టిస్తా అని అన్నది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.